గులాబ్‌ జామూన్‌లో బొద్దింక వచ్చినందుకు ఆ రెస్టారెంట్‌కు భారీ ఫైన్.. ఎంతో తెలిస్తే..!

హోటల్స్, రెస్టారెంట్స్ ఇంకా ఏదైనా ఆహార పదార్థాలు విక్రయించే సంస్థలు ఫుడ్ క్వాలిటీగా ఉండేలా జాగ్రత్త పడాలి.అశ్రద్ధ వహిస్తూ అపరిశుభ్రమైన, కలుషితమైన ఆహారం కస్టమర్లకు వడ్డిస్తే ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ మూల్యం చెల్లించక తప్పదు.

 A Huge Fine For The Restaurant For Getting A Cockroach In Gulab Jamun, Gulab Jam-TeluguStop.com

ఏదైనా రెస్టారెంట్‌లో ఫుడ్ క్వాలిటీగా లేకపోతే ఎక్కడ అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుందోనని కస్టమర్ల ఆ రెస్టారెంట్‌కు అస్సలు వెళ్లరు.కొందరు మాత్రం ఒక అడుగు ముందుకేసి ఆ తరహా రెస్టారెంట్లపై కేసులు వేస్తుంటారు.

ఇప్పుడు చెప్పబోతున్న ఓ సంఘటన ఈ కోవకే చెందిందే.ఇది 2016లో బెంగళూరులోని గాంధీనగర్ లోని కామత్‌ హోటల్‌ లో జరిగింది.

కామత్‌ హోటల్‌ అనే రెస్టారెంట్‌ బొద్దింక పడిన గులాబ్‌ జామూన్‌ను రాజణ్ణ అనే ఓ కస్టమర్‌కు ఇచ్చింది.అయితే ఆ గులాబ్ జామున్ తింటున్న సమయంలో అందులో ఓ చనిపోయిన బొద్దింక కనిపించింది.

దాంతో షాకయిన సదరు కస్టమర్ ఆ రెస్టారెంట్ నిర్వాకం బట్టబయలు చేయాలని వీడియో తీయడం ప్రారంభించారు.ఈ సమయంలో రాజణ్ణ మొబైల్‌ను లాక్కోవడానికి ప్రయత్నించిందీ రెస్టారెంట్ సిబ్బంది.

రెస్టారెంట్‌కు ఎక్కడ చెడ్డపేరు వస్తుందేమోనని భయంతో ఇలా చేశారని తెలుస్తోంది.

Telugu Thousandrupees, Bangalorekamat, Cockraochgulab, Consumers Forum, Rajanna,

అయితే బొద్దింక విషయం గురించి రాజణ్ణ రెస్టారెంట్ యాజమాన్యానికి కూడా తెలియజేశారు.కానీ రెండేళ్లు గడిచినా రెస్టారెంట్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అతడు స్థానిక పోలీస్‌స్టేషన్‌తో సహా వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు.కాగా తాజాగా ఈ కేసుపై ఫోరం విచారణ జరిపి రెస్టారెంట్ పై రూ.55 వేల ఫైన్ విధించింది.ఆ జరిమానా మొత్తం బాధితుడు రాజణ్ణకు చెల్లించాలని రెస్టారెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది.

ఈ తీర్పుపై రాజణ్ణ హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈ తరహా రెస్టారెంట్లపై వేసిన కేసులను త్వరగా పరిష్కరిస్తే.

కస్టమర్లకు ఇబ్బందులు ఉండవని ఆయన చెప్పుకొచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube