దేశానికి ప్రధాని అంటే ఎంత గౌరవం, భయం ఉంటుందో అందరికి తెలిసిందే.అలాంటి ప్రధాని తప్పు చేస్తే మనదేశంలో అయితే దాదాపుగా శిక్షలు ఉండవు.
కానీ విదేశాల్లోని కొన్ని చోట్ల మాత్రం చట్టం తనపని తాను చేసుకు పోతుంది.
ఇదే క్రమంలో నార్వే ప్రధాని ఎర్నా సోల్బెర్గ్ కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు భారీ జరిమానా విధించారు.
కాగా సోల్బెర్గ్ తన 60వ పుట్టినరోజు వేడుకలను గత నెలలో సన్నిహితులతో కలిసి జరుపుకున్న కార్యక్రమంలో 13 మంది వరకు సన్నిహితులు పాల్గొన్నారట.
ఈ విషయం కాస్త బయట తెలియడంతో, కరోనా సమయంలో ఫిజికల్ డిస్టెన్స్ రూల్స్ బ్రేక్ చేసి ఈ వేడుకలు జరిపినందుకు గానూ ప్రధానికి దాదాపు రూ.1.75 లక్షల జరిమానా విధించినట్లు నార్వే పోలీస్ చీఫ్ ఓలేసావెయరడ్ వెల్లడించారు.నిజంగా చట్టం అంటే ఇలా ఉండాలి.కానీ మనదేశంలోని చట్టాలు మాత్రం చుట్టలుగా వ్యవహరిస్తాయి అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.