మసాజ్ పేరుతో భారతీయుడికి భారీ టోకరా..  

A huge basket for an Indian in the name of massage , dubai, indian decent, Women in Nigeria, Al Refa, massage - Telugu Al Refa, Dubai, Indian Decent, Massage, Women In Nigeria

అమ్మాయిలతో మసాజ్ చేస్తామని అనగానే కకూర్తి పడిన ఓ భారతీయుడు ముందు వెనుకా ఆలోచన చేయకుండా తనకు వచ్చిన ఓ మెసేజ్ ను అనుసరించి అడ్డంగా బుక్కయ్యాడు. రూ.50 లక్షలు పోగొట్టుకుని ఇప్పుడు లబో దిబో అంటూ పోలీసులను ఆశ్రయించాడు.దుబాయ్ లో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.

TeluguStop.com - A Huge Basket For An Indian In The Name Of Massage

మసాజ్ కోసం ఇంత ఖర్చు పెట్టాడా అంటూ సోషల్ మీడియాలో సదరు భారత సంతతి వ్యక్తిపై జోకులు కూడా వేసుకుంటున్నారు.ఇంతకీ అసలేం జరిగిందంటే.దుబాయ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

దుబాయ్ లో ఉంటున్న భారత సంతతి వ్యక్తిని నలుగురు నైజీరిగా మహిళలు డేటింగ్ యాప్ ద్వారా సంప్రదించారు.

TeluguStop.com - మసాజ్ పేరుతో భారతీయుడికి భారీ టోకరా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అతి తక్కువ ధరకే అందమైన మహిళలతో మసాజ్ చేయిస్తామని నమ్మించారు.దాంతో ముందు వెనుకా ఆలోచన చేయకుండానే వారు చెప్పిన అల్ రేఫా అనే ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్మెంట్ కు ఒక్కడే వెళ్ళాడు.

ఇంట్లోకి అతడు వెళ్ళగానే అతడిని కట్టేసి నిర్భందించారు నలుగురు నైజీరిగా మహిళలు.అతడి వద్దనున్న క్రెడిట్ కార్డ్ తీసుకుని కత్తితో అతడిని బెదిరించి సుమారు రూ.5 లక్షలు కాజేశారు.

ఇలా మొత్తం అతడి నుంచీ దాదాపు రూ.50 లక్షలు ఊడ్చేశారు నైజీరిగా మహిళలు.ఆ రోజు మొత్తం ఉంచి మరుసరి రోజు వదిలేశారు.

దాంతో వెంటనే పోలీసులను ఆశ్రయించిన భారతీయుడు జరిగిన విషయాన్ని వివరించాడు.కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

కాగా మరో మహిళ పరారీలో ఉండటంతో ఆమె కోసం గాలిస్తున్నారు.త్వరలోనే ఆమెను పట్టుకుని సొమ్ము రికవరీ చేసి అతడికి అందిస్తామని పోలీసులు తెలిపారు.

ఇలాంటి డేటింగ్ యాప్ లను నమ్మి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచిస్తున్నారు అధికారులు.

#Al Refa #Dubai #Massage #Indian Decent

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు