మహిళా ఎస్‌ఐ మేడలో బలవంతంగా తాళి కట్టాలనుకున్నాడు ఆ హోమ్ గార్డ్.! చివరికి ఏమైందో తెలుసా.?  

A Home Guard Tries To Marry Lady Si In Chennai Egmore-forced Marriege,home Guard,home Guard Tries To Marry Lady Si,mani Meghalai 24,telugu Viral,viral In Social Meadia

అతనో హోమ్ గార్డ్. ఓ మహిళా ఎస్సైకు బలవంతంగా తాళికట్టలని ప్రయత్నించాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన విల్లుపురం జిల్లా లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే

A Home Guard Tries To Marry Lady Si In Chennai Egmore-Forced Marriege Home Mani Meghalai 24 Telugu Viral Social Meadia

A Home Guard Tries To Marry Lady Si In Chennai Egmore

నుంగంబాక్కం పోలీసు స్టేషన్‌లో మహిళా ఎస్‌ఐగా విల్లుపురం జిల్లా, తిరుక్కోవిలూరుకు చెందిన మణిమేగలై (24) పనిచేస్తున్నారు. ఈమె 2016లో వేలూరు కాట్పాడి పోలీసు స్టేషన్‌లో ఎఎస్‌ఐగా పనిచేశారు. ఆ సమయంలో కాట్పాడికి చెందిన బాలచంద్రన్‌ (25) హోంగార్డుగా పనిచేస్తూ వచ్చాడు. అప్పట్లో వారిద్దరూ చనువుగా ఉండేవారట.

దీన్ని ప్రేమగా భావించిన బాలచంద్రన్‌ మణిమేగలైను ప్రేమించాడు. శనివారం రాత్రి చెన్నైకు చేరుకున్న బాలచంద్రన్‌ ఎగ్మూరులోని ఉడుపి హోటల్‌ వద్ద మణిమేగలైతో మాట్లాడాడు. తన ప్రేమ విషయం చెప్పి వివాహం చేసుకోమని కోరాడు. ఇందుకు మణిమేగలై ఒప్పుకోలేదు.

దీంతో అతను ప్లాన్ ప్రకారం ముందే తెచ్చుకున్న తాళిబొట్టును మణిమేగలై మెడలో ప్రజల సమక్షంలోనే కట్టేందుకు ప్రయత్నించాడు. మణిమేగలై అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించింది. ప్రజలు బాలచంద్రన్‌ను పట్టుకుని ఎగ్మూరు పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

A Home Guard Tries To Marry Lady Si In Chennai Egmore-Forced Marriege Home Mani Meghalai 24 Telugu Viral Social Meadia