వైరల్: కొండ చిలువ టవల్‌ను మింగేసింది.. డాక్టర్లు ఎలా తొలగించారో తెలుసా?

మనుషులకు వున్న జ్ఞానం మరే ఇతర జీవికి విండదన్నది నిర్వివాదాంశం.మనుషులకే ఆకలి వేస్తే తమకి ఇష్టమైన, సరిపడిన ఆహారాన్ని తీసుకుంటారు.

 : A Hill Snake Swallowed A Towel.. Do You Know How The Doctors Removed It Viral-TeluguStop.com

అదే మూగ జీవాలు అయితే తన కంటికి కనబడిన వాటిని తింటూ జీవనం కొనసాగిస్తూ ఉంటాయి.ఒక్కోసారి కొన్ని జీవులు కొన్ని రకాల విషపదార్ధాలు తిని ప్రాణాలు కోల్పోతూ ఉంటాయి.

ఇటీవల కొన్ని మేకలు విషపూరితమైన ఆకులు తిని ప్రాణాలు పోయిన ఘటనను మనం చూసాం.అయితే తాజాగా ఓ కొండ చిలువ ఆకలిని తాళలేక ఓ భారీ టవల్‌ ని మింగేసి తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యింది.

ఆ టవల్‌ను జీర్ణం చేసుకోలేక నయయతన పడింది.ఇక దాని అవస్థను గుర్తించిన కొందరు స్థానికులు డాక్టర్లను పిలిచారు.వివరాల్లోకి వెళితే, ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్‌లోని ఓ కొండ చిలువ ఆకలిని తట్టుకోలేక ఓ టవల్‌ను మింగేసింది.ఆ తర్వాత దానిని జీర్ణం చేసుకోలేక, బయటకు కక్కలేక నానా అవస్థలు పడటంతో గమనించిన స్థానికులు వెటర్నరీ డాక్టర్లకు సమాచారం ఇచ్చారు.

దాంతో వారు దానిని జంతువుల ఆస్పత్రికి తీసుకెళ్లారు.అప్పటికే దాని పరిస్థితి విషమంగా మారింది.

దాంతో వైద్యులు అప్రమత్తమై ఆ కొండ చిలువకు మత్తు మందు ఇచ్చి అనంతరం దాని కడుపులోకి ఓ టూల్‌ పైప్‌ను పంపి.అతి కష్టం మీద ఆ టవల్‌‌ను బయటకు లాగారు.

దీంతో ఆ కొండ చిలువ ప్రాణాలతో బయటపడింది.ఆ తరువాత దానిని అడవిలో వదిలేసారు.

ఆపై అది వారిని కృతజ్ఞతగా చూస్తూ అక్కడినుండి వెళ్ళిపోయింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా తాజాగా వెలుగు చూసింది.

సదరు వీడియో యూట్యూబ్ లో Lets Make It Viral LMIV అనే ఛానల్ లో అప్లోడ్ చేసారు.ఇప్పటివరకు దానిని వేలమంది తిలకిస్తున్నారు.

ఒకసారి మీరు కూడా తిలకించి మీమీ అభిప్రాయాలను తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube