హీరోయిన్ అంటే దేవదాసీలా పనిచేయాలి.. అనసూయ షాకింగ్ కామెంట్స్!

జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరమయ్యారు.ఇలా ఈమె జబర్దస్త్ కార్యక్రమానికి దూరం కావడంతో ఎన్నో వార్తలు షికార్లు చేశాయి.

 A Heroine Should Work Like A Devdasi Anasuyas Shocking Comments Anasuya, Tollywo-TeluguStop.com

ఈ విషయంపై స్పందించిన అనసూయ తను సినిమాలతో బిజీ కావటం వల్ల ప్రతిసారి డేట్స్ అడ్జస్ట్ చేయమని అడగడానికి గిల్టీగా ఉండడం చేత తాను ఈ కార్యక్రమంలో నుంచి తప్పుకున్నానని తెలిపారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఇండస్ట్రీలో హీరోయిన్ల పరిస్థితి గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ ఇండస్ట్రీలో హీరోయిన్ కి ఏ మాత్రం వాల్యూ ఉండదని తెలిపారు.వాళ్లు కెమెరా ముందు నిలబడి కాపాడండి అని అరవడం లేదా సిగ్గుపడి నవ్వుతూ ఉండాలి.

అంతకుమించి హీరోయిన్స్ కి ఎలాంటి పని ఉండదని ఈమె తెలిపారు.ఇకపోతే హీరోయిన్స్ ఇండస్ట్రీలో వాళ్ళు చెప్పిన విధంగానే వినాలి.వాళ్ళు గిల్లితే గిల్లించుకోవాల్సిందేనని కామెంట్ చేశారు

Telugu Anasuya, Devdasi, Tollywood-Movie

ఇండస్ట్రీలో హీరోయిన్ అంటే ఒక దేవదాసీలా పనిచేయాలని భావిస్తారు.ఇది పూర్తిగా తప్పని ఈ సందర్భంగా ఈమె పేర్కొన్నారు.ఇక హీరోయిన్ ఇండస్ట్రీలో తమ హక్కుల గురించి మాట్లాడితే వారిపై ఇంట్రెస్ట్ తగ్గుతుందని ఈ సందర్భంగా అనసూయ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఇలా ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏదో విషయంలో అనసూయ బాగా హర్ట్ అయిందనే విషయం మాత్రం అర్థమవుతుంది.

అందుకే తరచూ ఈమె ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube