మెట్రో స్టేషన్‌లో ఇబ్బందిపెడుతున్న పావురాళ్లను తరమడానికి గద్దని నియమించుకున్నారు?

పట్టణాలలో భారీ క‌ట్ట‌డాలమీద, గుడి గోపురాలమీద, పురాతన భవంతులపైన పావురాలు అత్యధికంగా నివాసం ఉంటాయి.పావురాలు చూడటానికి ఆహ్లాదకరంగా ఉన్నప్పటికీ వాటి వ‌ల్ల తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.

 A Hawk Hired To Drive Away Pesky Pigeons At A Metro Station, Metro Station, Pige-TeluguStop.com

ముఖ్యంగా నివాస భ‌వ‌నాలకు ఇవి చాలా ఇబ్బంది కరంగా మారుతున్నాయి.సరిగ్గా అలాంటి ఇబ్బందే కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో మెట్రో స్టేష‌న్‌ అధికారులు ఎదుర్కొంటున్నారు.

వాటిని నియంత్రించ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశారు.కానీ వారి ప్లాన్స్ ఫలించలేదు.

ఆఖరికి ఆ అధికారులలో ఒకరికి అదిరిపోయే ఐడియా వచ్చింది.ఇందులో భాగంగానే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని మెట్రో సిస్ట‌మ్, పావురాల‌ను భ‌య‌ప‌ట్ట‌డానికి పాక్-మ్యాన్ అనే వేట గ‌ద్ద‌ని అద్దెకు నియమించుకుంది.5 ఏళ్ల వ‌యసున్న ఈ హారిస్ గ‌ద్ద ఉద్యోగం ఏమటంటే పావురాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వెతికి వాటిని తరిమేయడం.ఎల్ సెరిటో డెల్ నోర్టే స్టేషన్‌లో త‌న ప‌నిని ఆ గద్ద ప్రారంభించింది.

దీనికి సంబంధించి, BART (బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్)తో ప్యాక్-మ్యాన్ హ్యాండ్లర్ రికీ ఓర్టిజ్ ఫాల్కన్ ఒప్పందం చేసుకున్నారు.

ఇక్కడ ఆ గద్ద వారానికి మూడు రోజులు పాటు గస్తీ నిర్వహిస్తుంది.ప్లాట్‌ఫారమ్‌లను తీయడానికి ముందు స్టేష‌న్‌ కింద ఉన్న‌ ప్రవేశద్వారం వద్ద దాని రోజవారి ప‌ని ప్రారంభమ‌వుతుంది.ఇది స్టేషన్‌లోని అంచుల‌పైన‌, లోప‌లున్న‌ పరంజాపైన ఉండే పావురాలను తరిమి తరిమి కొడుతోంది.

అందుకుగాను ఆ స్టేషన్ అధికారులు దానికి పెద్దమొత్తంలోనే పారితోషికం ముట్టజెబుతున్నారట.ఈ గద్ద పుణ్యమాని దాని యజమాని దండిగా సంపాదిస్తున్నాడట.

ఒకప్పుడు బీదరికంలో వున్న దాని యజమాని అక్కడ కొత్త ప్లాట్ కూడా కొనుగోలు చేసాడట.దానికి ఆ గద్దపేరే పెట్టుకున్నాడట.

సూపర్ గద్ద కదూ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube