ఓ వ్యక్తి ప్రాణం తీసిన అలవాటు.. ఎలాగంటే.. ?

మనుషులకు ఉండే ఆలవాటు ఒక్కొక్క సారి ప్రాణాలు తీస్తాయని నిరూపించింది ఈ ఘటన.ఆ వివరాలు తెలుసుకుంటే.

 A Habit That Kills A Person-TeluguStop.com

ముంబై, కలినా ప్రాంతంలో వజ్రాల కార్మికుడిగా పని చేస్తున్న 25 ఏళ్ల వ్యక్తి తన కుటుంబసభ్యులతో కలిసి ఓ బిల్డింగ్‌లో నివాసం ఉంటున్నాడు.

అయితే ఇతనికి నిద్రలో నడిచే అలవాటు ఉందట.

 A Habit That Kills A Person-ఓ వ్యక్తి ప్రాణం తీసిన అలవాటు.. ఎలాగంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఒకరోజు రాత్రి 3 గంటల ప్రాంతంలో లేచిన ఆ వ్యక్తి నిద్రలో నడవటం మొదలుపెట్టాడట.అలా అటు ఇటు తిరుగుతూ, చివరికి నాలుగవ అంతస్తులోకి వెళ్ళి అక్కడ ఉన్న కిటికీలో నుండి కిందపడిపోయాడట.

ఆ సమయంలో అతను అరచిన అరుపులకు నిద్రలేచిన కుటుంబ సభ్యులు వెంటనే కిటికీలోంచి బయటకు చూడగా, క్రింద నేలపై రక్తపు మడుగులో ఆ వ్యక్తి కనిపించాడట.వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మరణించాడని వైద్యులు తెలిపారట.

ఇకపోతే మృతుడు నెలకోసారి గానీ, రెండుసార్లు గానీ, అర్థరాత్రి పూట నిద్రలో నడుస్తాడని, ఫ్లాట్‌లో అటు ఇటు తిరుగుతాడని పోలీసుల విచారణలో తెలిసింది.దీంతో ఈ కేసును ప్రమాదం కారణంగా సంభవించిన మరణంగా నమోదు చేసుకున్నారట పోలీసులు.

#Sleepwalking #Man Deceased #Mumbai #4th Floor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు