సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తికి హెల్మెట్ లేదని ... ఎంత ఫైన్ వేసారో తెలుసా ..?

మీకు సైకిల్ ఉందా .? అయితే జాగ్రత్త గెల్మెట్ లేకుండా బయటకి వెళ్లారో ట్రాఫిక్ పోలీసులు చలానా కాగితం చేతిలో పెట్టి కట్టమంటారు .! అదేంటి ఇదేమైనా బండా పెనాల్టీ కట్టడానికి అని మీకు డౌట్ రావచ్చు కానీ ఇది నిజమండి బాబు నమ్మకపోతే ఈ కింది మ్యాటర్ చదవండి మీకే అర్ధం అవుతుంది.

 A Guy On A Bicycle Does Not Have A Helmet How Much Fine Do You Know-TeluguStop.com

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కసీమ్ అనే యువకుడు బ్రతుకు దెరువు రీత్యా కేరళకు వలస వచ్చి ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తూ రోజుకు రూ.400 సంపాదించే కూలి… అయితే కసీమ్ ఇటీవల కంబాలా ప్రాంతంలో జాతీయ రహదారి గుండా తాను పనిచేసే చోటుకు వెళుతుండగా పోలీసులు అతన్ని ఆపి వేగంగా వెళుతున్నావు.దానికి తోడు హెల్మెట్ కూడా ధరించలేదని రూ.2000 జరిమానా కట్టాలని చలానా విధించారు… ఎందుకు జరిమానా కట్టాలి నేను రోజుకూలిని అని పోలీసులను బ్రతిమిలాడగా రూ.500 చలాన్ విధించి అది కట్టాలని సూచించి సైకిల్ టైర్ లోనుంచి గాలి కూడా తీసేసారు.ఇక ఆ చలాన్ పేపర్ గమనిస్తే.అందులో ఓ మహిళకు సంబందించిన ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్ నెంబరు ఉందని తెలిసింది…అది కాస్తా వైరల్ అవ్వడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube