సాయికుమార్.దిగ్గజ డబ్బింగ్ ఆర్టిస్టు.సినిమా హీరో.ఆయన నటించిన పోలీస్ స్టోరీ సినిమా సంచలన విజయం సాధించింది.అప్పటి నుంచి పోలీస్ పాత్రలకు సాయి కుమార్ పెట్టింది పేరుగా మారిపోయాడు.ఆయన తండ్రి పిజె శర్మ.
ఆయన కూడా నటుడు.అప్పట్లో ఓ సినిమా స్టార్ కు సంబంధించిన సినిమా వంద రోజుల వేడుకను తిరుపతిలో ప్లాన్ చేశారు.
ఈ సినిమాలో పిజె శర్మ నటించాడు.ఆయనకు కూడా ఈ వేడుకకు రావాలని ఆహ్వానం వచ్చింది.
తనకు తోడుగా రావాలని సాయి కుమార్ ను కూడా తీసుకెళ్లాడు శర్మ.అప్పుడు వాళ్ల కుటుంబ మద్రాసులోనే ఉంటుంది.
మద్రాసు నుంచి చార్టెడ్ ఫ్లైట్ ద్వారా తిరుపతికి తీసుకెళ్తారని చెప్పారు.పొద్దున్నే సినిమా ఆఫీసుకు వెళ్లారు శర్మ, సాయి.
అక్కడ ఎవరూ లేరు.టెక్నిషియన్స్ బస్సు ఉంది.
ఏంటని అడిగితే అప్పటికే గెస్టులు ఫ్లైట్ వెళ్లారని.మిగిలిన వారిని బస్సులో రావాలని చెప్పారు.
తప్పదు కాబట్టి.బస్సులోనే వెళ్లారు.
తిరుపతి విష్ణుప్రియ హోటల్ కు ముందుకు బస్సు వెళ్లి ఆగింది.వారికి కూడా ఇందులోనే హోటల్ రూం ఇచ్చారు.
సాయంత్రం అక్కడ వేడుక.అయితే జనాలు విపరీతంగా రావడంతో ఏవైన ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుందిన ఆ వేడుకను క్యాన్సిల్ చేశారు.
వెళ్లిన వారు తిరిగి వచ్చేటప్పుడు చార్టెడ్ ఫ్లైట్ లేదు.అతిథుల కోసం బస్సు వేశారు.అంతకు ముందు అదే బస్సులో శర్మ, సాయి వచ్చారు.ఆ బస్సులో అందరూ ఎక్కారు మధ్యలో ఓ చోట మూన్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశారు.
బస్సు అక్కడికి వెళ్లింది.ఆ బస్సులోకి ఓ ప్రొడ్యూసర్ వచ్చాడు.
మీరు వెళ్లి టెక్నిషియన్స్ బస్సులో మద్రాసు వెళ్లండి అని చెప్పాడు.శర్మకు కోపం ఓ రేంజిలో వచ్చింది.నేను వెళ్లిపోతాను.నాన్నను మాత్రం ఈ బస్సులోనే రానివ్వాలని సాయి వేడుకున్నాడు.కానీ తను పట్టించుకోలేదు.ఇద్దరినీ బస్సు దింపివేశారు.
ఆ ఇద్దరు నెమ్మదిగా వచ్చి టెక్నిషియన్స్ బస్సు ఎక్కారు.ఆ బస్సులో ఉన్నవారికి తినేందుకు ఓ బిర్యానీ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్ రమ్ ఇచ్చారు.ఓ రేంజిలో కోపంలో ఉన్న శర్మ ఆ బాటిల్ ను నేలకేసి కొట్టాడు.అదే కోపంలో మద్రాసుకు వెళ్లాడు.ఆ రోజు తన తండ్రికి జరిగిన అవమానాన్ని సాయి కుమార్ ఇప్పటికీ మర్చిపోలేదంటాడు.