వైరల్: ఈ రోల్ ను 20 నిమిషాలలో తింటే భారీ బహుమతి..!

బతకడానికి కోటి రకాల విద్యలు అని మన పెద్దవాళ్ళు ఉరికనే అనలేదు.తెలివితేటలూ ఉండాలే గాని ఎక్కడ ఎలా అయిన డబ్బులు సంపాదించుకోవచ్చు.

 A Great Gift To Eat This Roll In 20 Minutes Viral Latest, Viral News, Social Me-TeluguStop.com

మీకు గుర్తుందా ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అని ఒక ప్రముఖ మొబైల్ నెట్వర్క్ చెబుతుంది కదా.కానీ ఆ మాట అక్షర సత్యం.మనం చేసే వ్యాపారం గురించి పలువురికి తెలియాలంటే పబ్లిసిటీ కూడా చాలా ముఖ్యం.బాగా డబ్బులు ఉన్నవారు అయితే టీవీలోనే లేదంటే పోస్టర్స్ వేయించుకుని యాడ్స్ ఇస్తారు.

కానీ చిన్నా చితక వ్యాపారస్తులు అయితే అలా చేయలేరు.ఈ క్రమంలోనే ఒక వ్యాపారి తన బుర్రకి పదునుపెట్టి ఒక సరికొత్త ఆలోచన చేసాడు.

అదేంటంటే అతను మనకు ఒక కఠీ రోల్‌ ని తినమని ఇస్తాడు దానిని మనం కేవలం 20 నిమిషాల్లో తిని పెడితే 20 వేల రూపాయిలు మనకి బహుమతిగా ఇస్తాడన్నమాట.అబ్బా అంతేనా చాలా సింపుల్ గా ఉంది తినేస్తే పోలా.

ఎంచక్కా 20 వేల జేబులో పెట్టుకుని పోవచ్చు అని అనుకుంటే మాత్రం పప్పులో కాలు వేసినట్లే.అసలు విషయం ఏంటంటే ఆ కఠీ రోల్‌ సుమారు 10 కేజీల బరువు ఉంటుందన్నమాట.

దానిని తింటేనే డబ్బులు మీ సొంతం అవుతాయి.అసలు వివరాల్లోకి వెళితే.

దేశ రాజధాని ఢిల్లీలోని మోడల్ త్రీ టౌన్ లో ఒక రోడ్డు పక్కన పుడ్ స్టాల్ లో భారీ కాఠీ రోల్‌ని తయారు చేస్తారు.

అలాగే ఈ రోల్ ను పెద్ద సైజ్ చపాతీలాచేసి పెనం మీద కాల్చి 30 గుడ్లను ఒకదాని తరువాత ఒకటి కొట్టి కూరగాయలు,నూడిల్స్ తో తయారు చేస్తారు.ఈ భారీ కాఠీ రోల్‌ ను 20 నిమిషాల్లో తిన్నా వ్యక్తికి బహుమతిగా రూ.20 వేల రూపాయలను ఇస్తా అని షాప్ యాజమాన్యం ప్రకటించింది.ఈ రెసిపీకి సంబందించిన వీడియోను ఫుడ్ వ్లాగింగ్ పేజీ ది ఫుడ్ కల్ట్ లో షేర్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.ప్రస్తుతం ఈ వీడియోకి లక్షల సంఖ్యలో వ్యూస్ కూడా వచ్చాయి.

అలాగే ఇంత పెద్ద భారీ కాఠీ రోల్‌ ను చూసి నెటిజన్లు సైతం అవాక్ అవుతున్నారు.చూడటానికి నోరూరిపోతుందని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు మాత్రం డబ్బులకు ఆశపడి దీన్ని తినే సాహసం చేస్తే పొట్ట ఉబ్బడం ఖాయం అని కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube