కలలో దేవుడు కనిపించాడంటూ పొలంలో తవ్వకాలు తవ్విన రైతుకి బంగారు విగ్రహం లభ్యం.. ఆపై..?!

అప్పుడ‌ప్పుడు కొన్ని సంఘ‌ట‌న‌లు చూస్తుంటే నిజంగా ఆశ్చ‌ర్యం వేస్తుంది.అస‌లు నింజ‌గా ఇలా మ‌న‌కు జ‌రిగితే బాగుండు అనుకుంటాం.

 A Golden Idol Was Found For A Farmer Who Dug In The Field As God Appeared In A D-TeluguStop.com

ఎందుకంటే ఆ ఘ‌ట‌న‌లు కొంద‌రికి చాలా లాభం చేకూరుస్తాయి.చాలాసార్లు పొలం ప‌నుల్లో లేదా తవ్వ‌కాల్లో బంగారం, లేదా విగ్ర‌హాలు బ‌య‌ట‌ప‌డటం మ‌నం చాలానే చూశాం.

కానీ ఇప్ప‌డు కూడా అలాంటిదే ఓ ఘ‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఒక సామాన్య రైతు తన పొలంలో ప‌నుల నిమిత్తం త‌వ్వ‌కాలు జ‌రుపుతున్న క్ర‌మంలో ఓ బంగారు విగ్రహం బ‌య‌ట‌ప‌డింది.

దీంతో ఆ రైతు మల్లన్న స్వామి విగ్రహంగా కొలిచి త‌న ఇంటికి తీసుకెళ్లి రోజూ పూజలు చేస్తున్నాడు.అయితే ఈ విష‌యం ఆ నోటా ఈ నోటా పాకి కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దీంతో ఇది కాస్తా ఆఫీస‌ర్ల దృష్టికి వెళ్లింది.వారు వ‌చ్చి విగ్రహం స్వాధీనం చేసుకుని, ఎక్క‌డ దొరికింది, ఎలా దొరికింది అనే విష‌యాల‌పై విచార‌ణ స్టార్ట్ చేశారు.

,/br>

వివ‌రాల్లోకి వెళ్తే తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా కన్నాయిగూడం మండలం ముప్పనపల్లి గ్రామంలో జ‌రిగిన ఈ ఘటన బిల్ల నారాయణ అనే వ్యక్తి పొలంలో జ‌రిగింది.ఆయ‌న గుప్త నిధుల కోసం బుట్టాయిగూడెంకు చెందిన మరో వ్యక్తితో కలిసి తన పొలంలో రోజూ తవ్వకాలు జరిప‌గా ఓ సారి ఈ 500 గ్రాముల బంగారు మల్లన్న విగ్రహం ల‌భ్య‌మ‌యింది.

అంతే సంగ‌తి అత‌డు దాన్ని దేవుడి విగ్ర‌హంగా భావించి ఇంటికి వెళ్లి పూజలు చేస్తూ రోజూ కొలుస్తున్నాడు.

ఇక్క‌డే అస‌లు ట్విస్టు జ‌రిగింది.

నారాయ‌ణ త‌న పొలంలో జంతు బలి ఇవ్వ‌డం గ్రామస్థులకు తెలిసింది.దీంతో వారు నారాయణ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంట‌నే రంగంలోకి దిగిన పోలీసులు గుప్త నిధుల తవ్విన ప్రదేశాన్ని పరిశీలించి, నారాయ‌ణ ఇంట్లో ఉన్న విగ్ర‌హాన్ని స్వాధీనం చేసుకున్నారు.నారాయణను విచారించ‌గా అసలు విషయం బయట పెట్టాడు మ‌నోడు.

అత‌నిపై పోలీసులు కేసు న‌మోదు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube