వైర‌ల్‌.. కోడిని కాపాడేందుకు గ‌ద్ద‌తో ఫైట్ చేసిన మేక‌..

సోష‌ల్ మీడియా అంటేనే వింత వీడియోల‌ను వెతికి ప‌ట్టుకుని మ‌రీ చూపిస్తోంది.అందుకే దీన్ని ఎక్కువ‌గా టైమ్ పాస్ కోసం వాడుతుంటారు చాలామంది.

 A Goat That Fought With An Eagle To Save A Chicken-TeluguStop.com

అయితే ఇందులో మ‌న ఊహ‌కు కూడా అంద‌న‌టువంటి వీడియోలు, ఫొటోలు క‌నిపిస్తుంటాయి.ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుంటే బాగోద‌ని నెటిజ‌న్లు ఇట్టే వైర‌ల్ చేసేస్తుంటారు.

ఇక‌పోతే ఇప్పుడు కూడా ఇలాంటి ఓ విచిత్ర‌మైన వీడియో అంద‌రినీ తెగ ఆక‌ట్టుకుంటోంది.అయితే ఇది కూడా జంతువులకు సంబంధించిందే కావ‌డంతో ఈజీగానే ట్రెండింగ్ లోకి వ‌చ్చేసింది.

 A Goat That Fought With An Eagle To Save A Chicken-వైర‌ల్‌.. కోడిని కాపాడేందుకు గ‌ద్ద‌తో ఫైట్ చేసిన మేక‌..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

జంతువుల్లో ఏ జాతికి చెందినవి ఆ జాతి జంతువుల‌తోనే స్నేహం చేస్తుంటాయి.ఇత‌ర జాతుల‌కు చెందిన వాటితో అస్స‌లు ఉండ‌వు.కానీ కొన్ని సార్లు మాత్రం మ‌న‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించే విధంగా ఇత‌ర జాతుల‌కు చెందిన‌టువంటి జంతువుల‌తో కూడా స్నేహం చేయ‌డం మ‌నం చూస్తున్నాం.ఇక ఇలాంటి స్నేహితుల ప్రాణాలమీదకు ఏదైనా ప్ర‌మాదం వ‌స్తే మాత్రం అవి అస్సలు ఊరుకోవు.

అవతల ఎంత పెద్ద ప్ర‌మాదం ఉన్నా స‌రే వాటితో ధైర్యంగా పోరాడతాయి.ఇక ఇప్పుడు మ‌నం చూస్తున్న వీడియోలో కూడా ఇలాంటిదే జ‌రిగింది.

అదేంటంటే ఈ వీడియోలో ఓ ఇంటిబయట తిరుగుతున్న కోడి వ‌ద్ద‌కు అనూహ్యంగా దాన్ని ఎత్తుకుపోయేందుకు ఒక్కసారిగా ఆకాశం నుంచి గ‌ద్ద వ‌స్తుంది.ఇంకేముంది వ‌స్తూనే ఆ కోడిని ప‌ట్టేసుకుని ఎత్తుకెళ్లాలని చూస్తుంది.ఇక కోడి దాని నుంచి త‌ప్పించుకునేందుకు ఎంత ప్ర‌య‌త్నించినా కూడా ఫ‌లించ‌దు.అయితే కోడి ఆర్తనాదాలు విన్న ఓ మేక మెరుపు వేగంతో వ‌చ్చి ఆ గ‌ద్దతో పోరాటానికి దిగింది.

ఇక ఆ మేక ధాటికి భ‌య‌ప‌డిపోయి ఆ గ‌ద్ద కోడిని వదిలి వెళ్లిపోతుంది.అంటే కోడిని మేక పోరాటం చేసి మ‌రీ కాపాడింద‌న్న మాట‌.మ‌రి మీరు కూడా చూసేయండి.

#Chicken #Goat #Eagle

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు