త‌న‌ను తినేందుకు మాటు వేసిన కుక్క‌కు చుక్క‌లు చూపించిన మేక‌

జంతువుల్లో చాలా వ‌ర‌కు ఇత‌ర జంతువుల‌ను తిని బ‌తికేవే ఎక్కువ‌గా ఉంటాయి.ఓ జంతువుకు ఆక‌లి వేసిందంటే మ‌రో జంతువు ఆయువు మూడిన‌ట్టే.

 A Goat Showing The Dots To A Dog That Has Promised To Eat Itself Details, Goat,-TeluguStop.com

ఇది అడ‌విలో ఉండే జంతువుల‌కు అయితే ఇంకా బాగా సూట్ అవుతుంది.అక్క‌డ మ‌రో జంతువును చంపి తిన‌డం త‌ప్ప మ‌రో మార్గం ఉండ‌దు క్రూర మృగాల‌కు.

అందుకే వాటికి ఆక‌లి వేసిన‌ప్పుడ‌ల్లా సాధు జంతువులు బ‌లైపోతుంటాయి.అయితే సాధు జంత‌వులను వేటాడ‌బోయి కొన్ని సార్లు క్రూర జంతువులు కూడా ఇబ్బందుల్లో ప‌డుతుంటాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే జ‌రిగింది.

అడ‌విలో ఉండే జంతువులే కాకుండా మ‌న మ‌ధ్య ఉండే జంతువులు కూడా ఇత‌ర జంతువులును చంపి తినేవి ఉంటాయి.

మ‌న మ‌ధ్య ఎక్కువ‌గా క‌నిపించే కుక్క ఇలాంటి కేట‌గిరీలోకి వ‌స్తుంది.దానికి మ‌నుషులు పెట్టే తిండి ఎంత ఉన్నా స‌రే ఇత‌ర జంతువుల‌ను చంపితినాలని చూస్తుంది.అయితే ఇప్పుడు ఓ ఇంటి ముందు ఉన్న కుక్క కూడా ఇలాగే చేయ‌బోయి చివ‌ర‌కు చుక్క‌లు చూసింది.ఈ వీడియోలో ఓ ఇంటి వ‌రండాలో రెండు మేక‌లు ఉండ‌టం మ‌న‌కు క‌నిపిస్తుంది.

అయితే ఈ రెండు మేక‌ల్లో ఒక‌దాన్ని తినేందుకు ఓ కుక్క ప‌క్క‌నే ఉన్న టేబుల్ కింద దాక్కోవ‌డం క‌నిపిస్తుంది.

అయితే కుక్క‌ను ప‌సిగ‌ట్టిన మేక దాని నుంచి త‌ప్పించుకునేందుకు కొంచెం ముందుకొస్తుంది.ఇక అదును కోసం ఆ కుక్క వేచి చూస్తుంటుంది.కానీ మేక ధైర్యం తెచ్చుకుని అమాంతం టేబుల్ కింద ఉన్న కుక్క మీద‌కు దాడికి దిగుతుంది.

త‌న బ‌ల‌మైన కొమ్ములతో కుక్క‌ను కుమ్మేస్తుంది.దీంతో మేక దాడికి అక్క‌డి నుంచి త‌ప్పించుకుని ఆ కుక్క బ‌తుకు జీవుడా అంటూ ప‌రుగులు తీస్తుంది.

ఇదంతా కూడా కొంద‌రు వీడియో తీయ‌గా దాని మీద ఫ‌న్నీ మీమ్స్ పేలుతున్నాయి.ఏదో అనుకుంటే ఏదో అయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube