ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు 'శ్రీదేవి సోడా సెంటర్' గ్లిమ్స్ !

టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో సుధీర్ బాబు ఒకరు.ఈయన నాలుగు పదుల వయసులో కూడా తన బాడీని ఫిట్ గా ఉంచుకుంటున్నాడు.

 A Glimpse Of Sooribabu From Sridevi Soda Center-TeluguStop.com

ఈయన కృష్ణ చిన్న కూతురు ప్రియదర్శిని పెళ్లి చేసుకున్న తర్వాత నటనపై ఉన్న ఇష్టంతో సినిమాల్లోకి వచ్చాయి.ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు.

ఆ తర్వాత ఎస్ ఎమ్ ఎస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

 A Glimpse Of Sooribabu From Sridevi Soda Center-ఆకట్టుకుంటున్న సుధీర్ బాబు శ్రీదేవి సోడా సెంటర్’ గ్లిమ్స్ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొదటి సినిమాతో ఆకట్టుకోలేక పోయినా మారుతీ దర్శకత్వంలో వచ్చిన ”ప్రేమ కథ చిత్రం” తో మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఆ తర్వాత ఆచి తూచి సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ రోజు ఈయన పుట్టిన రోజు సందర్భంగా ఆయన తాజాగా నటించిన శ్రీదేవి సోడా సెంటర్ సినిమా నుండి గ్లిమ్స్ విడుదల చేసింది చిత్ర యూనిట్.

ప్రస్తుతం సుధీర్ బాబు పలాస సినిమా ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో ‘శ్రీదేవి సోడా సెంటర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఈ సినిమాను రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.ఇందులో ఆనంది హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను 70 ఎం ఎం ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై శశి దేవిరెడ్డి, విజయ్ చిల్లా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు మని శర్మ సంగీతం అందిస్తున్నాడు.

ఈ రోజు సుధీర్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ”గ్లిమ్స్ ఆఫ్ లైటింగ్ సూరిబాబు” పేరు తో ఈ వీడియోను విడుదల చేసారు.

గోదావరి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది.సూరిబాబు పాత్రలో సుధీర్ బాబు ఆకట్టుకున్నాడు.

ఈ గ్లిమ్స్ ఆద్యంతం ఆయన లుక్ ను ఎలివేట్ చేసే విధంగా ఉంది.సిక్స్ ప్యాక్ లుక్ తో సుధీర్ బాబు తేరా మీద అందంగా ఉన్నాడు.

చూడాలి మరి సుధీర్ బాబు ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో.

#GlimpseOf #SriDevi #Sudheer Babu #AGlimpse #DirectorKaruna

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు