ఆత్మహత్య చేసుకునే ముందు...ఆ యువతి గోరింతతో చేతిపై ఏం రాసిందో తెలుసా.?

ఈమధ్య ప్రేమించడం…ప్రేమలో మోసపోవడం…మోసపోయామని ఆత్మహత్య చేసుకోవడం అనే సంఘటనలు ఎక్కువ అయిపోయాయి.అలంటి ఓ ఘటనే తాజాగా హర్యానాలోని ఫరీదాబాద్‌లో చోటుచేసుకుంది.

 A Girl Writes Suicide Note On Hand In Faridabad-TeluguStop.com

ఆత్మహత్య చేసుకునే ముందు ఆ యువతి తన అరచేతిపై గోరింటతో సూసైడ్ నోడ్ రాసింది.ఆ సూసైడ్ నోట్ లో ఏముంది? అనే వివరాలలోకి వెళ్తే.!

సూసైడ్ నోట్‌లో తాను ప్రేమ పేరుతో ఒక యువకుని చేతిలో మోసపోయినట్టు పేర్కొంది.ఫరీదాబాద్‌లోని జమాయీ కాలనీలో హీనా అనే యువతి ఆత్మహత్య చేసుకుంది.తన ఆత్మహత్యకు గల కారణాలను వివరిస్తూ అరచేతిపై సూసైడ్ నోట్ రాసింది.దానిలో బాయ్‌ఫ్రెండ్ ఫోను నెంబరు కూడా రాసింది.

సమాచారం అందుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రెండేళ్ల క్రితం వరకూ హినా…బీహార్‌లో ఉంటూ చదువుకుంటోంది.ఈ నేపధ్యంలోనే ఆమెకు దూరపుబంధువైన సద్దామ్‌తో స్నేహం కుదరి, ప్రేమకు దారితీసింది.చదుపు పూర్తయ్యాక ఆమె తిరిగి ఫరీదాబాద్‌కు వచ్చింది.ఈ సమయంలో వారిద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి.వీటి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నదని పోలీసులు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube