తొమ్మిదేళ్లకే ఐఓఎస్ యాప్ డెవలప్ చేసిన బాలిక.. ఫిదా అయిన యాపిల్ సీఈఓ!

దుబాయ్‌లో నివసిస్తున్న 9 ఏళ్ల భారతీయ బాలిక ఇటీవల ఐఫోన్‌ల కోసం ఒక ఐఓఎస్ యాప్‌ను రూపొందించింది.ఈ చిన్నారి ‘హనాస్‘ అనే ఓ స్టోరీటెల్లింగ్ యాప్‌ను డెవలప్ చేసింది.

 A Girl Who Developed An Ios App At The Age Of Nine.. Apple's Ceo Is Fed Up ,duba-TeluguStop.com

ఇది తల్లిదండ్రులు చెప్పే స్టోరీస్ రికార్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది.అయితే చిన్న వయసులోనే తమ యాపిల్ ఫోన్స్ కోసం ఒక చక్కటి యాప్ తీసుకొచ్చినందుకు గాను యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఈ తొమ్మిదేళ్ల బాలికపై ప్రశంసలు కురిపించారు.

కుక్‌ రాసిన తొలి లేఖలో 9 ఏళ్ల హనా ముహమ్మద్ రఫీక్ అతి పిన్న వయస్కురాలైన ఐఓఎస్ డెవలపర్ అని పేర్కొన్నారు.

ఈ బాలిక యాపిల్ సీఈఓకి తన సాఫ్ట్‌వేర్, ఇతర విజయాలను ఈమెయిల్‌లో వివరించింది.

దాంతో ఆమెను అభినందిస్తూ సీఈవో రిప్లై ఇచ్చారు.హనా రూపొందించిన ఐఓఎస్ యాప్‌ పూర్తిగా ఉచితం.

ఇందులో పిల్లలకి నచ్చే కథలు ఉన్నాయి.ఈ బిజీ లైఫ్‌లో కొంతమంది తల్లిదండ్రులకు తమ పిల్లలకు కథలు చదివి వినిపించడానికి ఖాళీ సమయం దొరకడం లేదు.

అందుకే ఒకసారి రికార్డ్ చేసి పెడితే నిత్యం కథలు వినిపించే లాగా ఒక యాప్ తీసుకురావాలని హనా ఆలోచన చేసింది.ఆ ఆలోచనతోనే యాప్‌ని డెవలప్ చేసింది.

ఈ యాప్‌ను రూపొందించినప్పుడు హనా వయసు ఎనిమిదేళ్లు.

Telugu Indian, Apple Ceo, Dubai, Hana Muhammad, Ios App, Story App, App, Tim Coo

ఒక ఈమెయిల్‌లో హనా తనకు ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడే కోడింగ్‌ గురించి తెలుసుకోవడం మొదలు పెట్టానని.ప్రపంచంలో అలా చేసిన అతి పిన్న వయస్కురాలు తానేనని పేర్కొంది.ఈ యాప్ కోసం ఈ చిన్నారి సుమారు 10,000 లైన్ల కోడ్‌ను రాసింది.

తల్లిదండ్రులు తమ పిల్లల కోసం కథలను వారి వాయిస్‌లో రికార్డ్ చేయడానికి ఈ స్టోరీటెల్లింగ్ యాప్‌ను ఉపయోగించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube