అలాంటి యాడ్ లను నమ్మకండి

మీరు ఏదో వెబ్ సైట్ లో ఏదో చదువుతుంటారు .కాస్త కిందికి స్క్రోల్ చేయగానే ఏదో తెల్ల క్రీమ్ ని చూపెడుతూ .

 A Fraud Fairness Cream Ad Fakes Amit Mishra In Before And After Phase-TeluguStop.com

ఇది వాడగానే నెలరోజుల్లో ఇలా తెల్లగా అయిపోయారు అని ఒకే వ్యక్తికి సంబంధించిన రెండు ఫోటోలు దర్శనమిస్తుంటాయి.క్లిక్ చేస్తే వేలల్లో రేటు ఉంటుంది.

కొందరు అమాయకులు కొనేస్తారు.

అలాంటి యాడ్ నిజానికి చాలా సందర్భాల్లో పూర్తి అవాస్తవంగా ఉంటున్నాయి.

ఎవరో ముక్కుముఖం తెలియని వ్యక్తుల ఫోటోలను దొంగలించి, వాటినే ఫోటోషాప్ చేసి, ఒక ఫోటోలో నల్లగా ఉన్నట్లు, మరో ఫోటోలో తెల్లగా మారినట్లు చూపిస్తున్నారు.షాకింగ్ న్యూస్‌ ఏంటంటే, భారత క్రికేటర్, టీమ్ ఇండియా, ఢిల్లీ డేర్ డెవిల్స్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ముఖాన్ని వాడుకుంటూ ఒక యాడ్ ని పెట్టింది ఓ కంపెనీ.

అమిత్ మిశ్రా ఆ క్రీమ్ వాడి తెల్లగా మారాడంట.వారికి మిశ్రా ఎవరో తెలియక పెట్టారా లేక, జనాలకి తెలిసుండదులే అని పెట్టారా అనేది అర్థం కావడం లేదు.

అయినా, ముఖానికి మొటిమో, మచ్చో అయితే తొలగించుకోవడం కోసం ఏదైనా వాడితే ఒకే, చర్మాన్ని బాగుచేసుకోవడం అంటారు దాన్ని.కాని పుట్టుకతో వచ్చిన రంగు కాదని, ఇంకేదో కావాలని ఎందుకో అంత తాపత్రయం.

మనల్ని మనమే ప్రేమించుకోలేనప్పుడు, ఇంకెవరో ఎందుకు ప్రేమిస్తారు ?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube