అద్భుతంగా పెయింట్ వేస్తున్న ఐదేండ్ల చిన్నారి..

చిన్న పిల్లలు చేసే పనులు ఎక్కువగా కోపాన్ని తెప్పించేవిగా ఉంటాయి.ఇంట్లో వారు చేయని అల్లరి అంటూ ఉండదు.

 A Five Years Child Wonderfully Painting Details, Painting, Viral Video, Five Yea-TeluguStop.com

అప్పుడప్పుడే పూర్తి స్థాయిలో మాటలు మాట్లాడుతూ.అక్షరాలు నేర్చుకుంటూ ఉంటారు.

ఒకే చోట కుదురుగా ఉండరు.మ్యాక్జిమమ్ 2 నుంచి 3 నిమిషాల పాటు దేనిపైనా కాన్సన్‌ట్రేట్ చేయలేరు.

కొందరు విసుగు తెప్పిస్తుంటారు.మరికొందరు చక్కగా ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటారు.

కానీ కొంత మంది పిల్లలు చాలా డిఫరెంట్.వారు తమ ఏజ్‌కు సంబంధం లేని పనులు చేస్తుంటారు.

వయస్సుకు, క్రియేటివిటికి సంబంధం లేదని చెబుతూ ఎప్పటికప్పుడు ఎదుటి వారిని ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు.ఈ కేటగిరీకి చెందినదే ఈ ఐదేండ్ల చిన్నారి.

పలకా బలపం పట్టుకుని అక్షరాలు నేర్చుకోవాల్సిన పాప.కుంచెతో అద్భుతమైన పెయింటింగ్స్ వేస్తోంది.ఓ పెద్ద కాన్వాస్‌పై చిన్నారి పెయింటింగ్ వేస్తుండగా దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.వీడియోను చూసి చిన్నారి క్రియేటివిటిని పొగడకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్స్.

ఈ వీడియోలో మొదట నార్మల్‌గా తన పెయింటింగ్ స్టార్ట్ చేసిన చిన్నారి.

ఎండింగ్ స్టేజ్ కు వచ్చే సరికి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించింది.ఆ పెయింటింగ్‌కు ఓ అందాన్ని తీసుకొచ్చింది.

దీనికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

ఆ చిన్నారి టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.పెద్ద కాన్వస్‌పై బ్రేక్ లేకుండా పెయింటింగ్ వేయడం నిజంగా అమేజింగ్ అంటూ కొందరు కామెంట్స్ పెడుతుండగా.పాపకు మంచి ఫ్యూచర్ ఉంది అంటూ మరి కొందరు మెచ్చుకుంటున్నారు.

ప్రస్తుతం నెటిజన్స్‌ను ఈ వీడియో ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది.ప్రతి మనిషిలో ఎదో ఒక క్రియేటివిటి ఉంటుంది.

మరి మీ ఇంట్లో ఉన్న చిన్నపిల్లల్లో ఎలాంటి క్రియేటివిటి దాగుందో తెలుసుకునే ప్రయత్నం చేయండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube