వైరల్‌ వీడియో : చేపనుండి వస్తున్న కరెంట్‌తో క్రిస్మస్‌ లైట్లు ఎలా వెలుగుతున్నాయో చూడండి

మనకు కరెంట్‌ అనేది నీటి నుండి బొగ్గు నుండి చెత్త నుండి వస్తుందని మాత్రమే తెలుసు.కాని చేపల ద్వారా కూడా కరెంట్‌ వస్తుందని ఎంత మందికి తెలుసు.

 A Fish Release 800 Volt Power And Given Current For Light-TeluguStop.com

చేపల్లో కరెంట్‌ ఉత్పత్తి అవుతుంది.అయితే ఆ కరెంట్‌ను మనం వాడుకోవడం అనేది ఎలా సాధ్యం.

అమెరికాలోని ఒక ప్రముఖ సంస్థ అక్వెరియంలో చేపను ఉంచి దాని నుండి కరెంట్‌ పుట్టిస్తూ క్రిస్మస్‌ ట్రీపై ఉన్న లైట్లను వెలిగిస్తున్నారు.అలా కంటిన్యూగా ఆ చేప నుండి ఏకంగా 800 వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

చేప నుండి వస్తున్న విద్యుత్‌తో వెలుగుతున్న క్రిస్మస్‌ లైట్ల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.అక్వెరియంలోని చేప కదిలిన ప్రతి సారి కూడా విద్యుత్‌ జనితం అవుతుంది.దాంతో లైట్లు వెలుగుతున్నాయి.ఈల్‌ మిగెల్‌ వాట్సన్‌ అనే ఈ చేప సాదారణంగా కదిలితే 10 వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది.అదే ఆ చేపకు కోపం వచ్చినా లేదంటే ఫుడ్‌ దొరికి ఎగ్జైట్‌ అయినా కూడా ఏకంగా 800 వాట్ల విద్యుత్‌ అంటే ఆ సమయంలో ఆ చేపను పట్టుకుంటే చనిపోయేంత షాక్‌ తలుగుతుందన్నమాట.దాన్ని సెన్సార్ ల ద్వారా తీసుకుని లైట్ ను వెలిగిస్తున్నారు.

ఆ చేపకు కోపం వచ్చేట్లు చేయడం లేదంటే ఫుడ్‌ వేసి ఎగ్జైట్‌ చేయడం చేస్తున్నారు.అలా ఆ అక్వేరియంలోని క్రిస్మస్‌ చెట్టుపై ఉన్న లైట్లు కంటిన్యూగా వెలుగుతూనే ఉన్నాయి.ఈ విషయాన్ని చూసేందుకు స్థానికంగానే కాకుండా అమెరికాలోని ఇతర రాష్ట్రాల నుండి కూడా జనాలు తరలి వస్తున్నారాట.చేపల నుండి విద్యుత్‌ను తయారు చేసే విధానం ఎంటా అంటూ అంతా ఆశ్చర్యపోతూ అక్వేరియంకు క్యూ కడుతున్నారు.

ఈ కింద వీడియోలో ఆ విషయాన్ని చూడవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube