ఆదిలాబాద్ జిల్లాలోని( Adilabad District ) బోథ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.బోథ్ లోని( Boath ) ఓ పరుపుల తయారీ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పత్తి నిల్వలు ఎక్కువగా ఉండటంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి.ఈ మంటల్లో చిక్కుకుని ఓ వ్యక్తి సజీవదహనం అయ్యాడు.
మృతుడు మహ్మద్ ఉమర్( Mahammed Umar ) అనే కూలీగా గుర్తించారు.
కాగా మంటల ధాటికి దుకాణం పూర్తిగా దగ్ధమైంది.స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.అయితే ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.