అలాంటి కాల్స్ చేస్తే రూ.10వేల ఫైన్‌.. ట్రాయ్ సంచ‌ల‌న నిర్ణ‌యం!

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ సహజంగా కనిపిస్తుంటుంది.చాలా మంది చేతిలో స్మార్ట్ ఫోన్లు దర్శనమిస్తుంటాయి.

 A Fine Of Rs 10,000 Will Be Levied For Making Such Calls., Trai, Phone Calls,lat-TeluguStop.com

ఫోన్లు ఉన్నవారికి కంపెనీల నుంచి వచ్చే అవసరం లేని ఫోన్ కాల్స్ మెస్సేజులు చికాకు తెప్పిస్తాయి.అలాంటి ఫోన్ కాల్స్ నుంచి ఎంతలా తప్పించుకునేందుకు ప్రయత్నించినా… కూడా మనం తరచూ విఫలమవుతూనే ఉంటాం.

అలా చేసే కంపెనీలకు భారీగా వడ్డనలు ప్రతిపాదిస్తూ… ట్రాయ్ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.మనదేశంలో టెలికం కంపెనీలను నియంత్రించేందుకు కేంద్రం ట్రాయ్ ను ఏర్పాటు చేసింది.

కానీ ఇప్పుడు అలా కాదు ఏదైనా నెట్ వర్క్ కు సంబంధించి ఇలా విసిగించే కాల్స్ చేసినా, మెస్సేజులు పంపినా భారీ జరిమానాలు విధించాలని ట్రాయ్ నిర్ణయం తీసుకుంది.ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం ఇలా ఏ నెట్ వర్క్ లోనైనా అనవసర కాల్స్ చేసి విసిగిస్తే.

అక్షరాలా పది వేల రూపాయలు జరిమానాగా విధించనున్నారు.జరిమానాలు విధించిన తర్వాత కూడా ఎవరైనా ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తే….

కొరడా ఝలిపించనున్నట్లు ట్రాయ్ అధికారులు తెలిపారు.జరిమానాలు విధించిన తర్వాత కూడా తీరు మార్చుకోని టెలికం ఆపరేటర్లను రెండేళ్ల పాటు బ్యాన్ చేస్తామని ట్రాయ్ స్పష్టం చేసింది.

SMS అని టైప్ చేసి 1909 నెంబర్ కు పంపిస్తే… ఎలాంటి విసిగించే మెస్సేజులు రాకుండా ఉంటాయని ట్రాయ్ తెలిపింది.అంతే కాకుండా ఇలాంటి సమస్యలను నియంత్రించేందుకు టెలికం శాఖ ఒక డిజిటల్‌ ఇంటెలిజెన్్ం‌ యూనిట్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తుందట.

లైసెన్స్ కలిగిన సర్వీసు ప్రాంతాల్లో టీఏఎఫ్‌సీవోపీ ఏర్పాటవుతుందట.ఇలా ఈ రెండు విభాగాలను ఏర్పాటు చేయడం వలన క్షేత్ర స్థాయిలో వినియోగదారుల సమస్యలను త్వరగా పరిష్కరించవచ్చని ట్రాయ్ భావిస్తోందట.

Telugu Phone, Trai-Latest News - Telugu

ఒక వేళ.ఏదైనా కంపెనీ తన వినియోగదారులకు ప్రమోషన్లకు సంబంధించిన సమాచారం తెలియాలని ఫోన్లు చేస్తే విధించే జరిమానాలను ట్రాయ్ తెలిపింది.మొదటి తప్పకు కేవలం వేయి రూపాయల జరిమానాతో వదిలి పెట్టాలని సూచించింది.

మొదటి తప్పు తర్వాత ఒక వేళ… అలాగే చేస్తే… నిబంధనను ఉల్లంఘించిన ప్రతి సారి ఐదు వేల రూపాయల చొప్పున వడ్డించనున్నారు.జరిమానాతో పాటు సదరు టెలికం కంపెనీ కనెక్షన్ ను కూడా రద్దు చేస్తామనే హెచ్చరిక అందుతుంది.

ఇలా మూడో సారి కూడా చేసినట్లు గుర్తిస్తే…పది వేల రూపాయల జరిమానాను విధించడమే కాకుండా కనెక్షన్ ను కూడా రద్దు చేసేలా కొత్త నిబంధనలను ట్రాయ్ ప్రవేశపెట్టింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube