వైరల్.. కూతురు కోసం 1200 కిలోమీటర్లు నడిచిన తండ్రి!

తల్లిందండ్రులు తమ పిల్లలను ఎంతగానో ప్రేమిస్తారు.వారి తర్వాతే ఎవరైనా.

 A Father Who Walked 1200 Kilometers For His Daughter, Army, Army Jawan, Branning-TeluguStop.com

తమ పిల్లలకు కష్టం వస్తే అది వారి కష్టంగా భావించి పిల్లలను ఆ కష్టం నుండి బయటకు తీసుకు రావాలి అని అనుకుంటారు.అందుకోసం వారు ఎంతటి భాధ అయినా ఆనందంగా భరించడానికి సిద్ధం అవుతారు.

ఇక పిల్లలకు ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి చనిపోతారని తెలిస్తే ఇక తల్లిదండ్రుల బాధ వర్ణించడం చాలా కష్టం.

వారి ఆరోగ్య సమస్య నుండి కాపాడడం కోసం ఎంతటి కష్టం అయినా సుఖంగా అనుభవిస్తారు.

కేవలం వారు ఆ సమస్య నుండి బయట పడితే చాలు.తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది.

ఒక తండ్రి తన కూతురు ను కాపాడు కోవడం కోసం ఏం చేసాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు.అతడు ఒక ఆర్మీ జవాన్.

తన కూతురుకు ఒక అరుదైన వ్యాధి వచ్చింది.

దీంతో అతడు ఆ ఆర్మీ జవాన్ తన కూతురును కాపాడు కోవడం కోసం చెప్పులు లేకుండా ఉట్టి కాళ్లతో 1200 కిలో మీటర్లు ప్రయాణం చేసాడు.

తన కూతురు పేరుతొ ఒక ఛారిటీ స్థాపించి కాలినడకన ఫండింగ్ కలెక్ట్ చేస్తూ 1200 కిలో మీటర్లు అలానే ప్రయాణం చేసాడు.ఈయన చేసిన పనికి అందరు ఆశ్చర్య పోతున్నాడు.

కూతురు అంటే ఎంత ప్రేమ అని అందరు అతడిని ప్రశంసిస్తున్నారు.

Telugu Jawan, Cdls, Hope Hasti-Latest News - Telugu

ఆ యూఎస్ ఆర్మీ జవాన్ పేరు బ్రాన్నింగ్.అతడి కూతురు పేరు హస్తి.తనకు జన్యు లోపంతో సిసిఎల్ఎస్ అనే అరుదైన వ్యాధి వచ్చింది.

ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స లేకపోవడంతో అతడి ఎలాగైనా తన కూతురును కాపాడుకోవడం కోసం హాప్ ఫర్ హస్తి పేరుతో ఒక ఛారిటీ స్థాపించి కాలినడకన దేశంలోని చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఫండింగ్ కలెక్ట్ చేస్తున్నాడు.

ఈ విరాళాల ద్వారా వచ్చిన డబ్బును మరీన్ లోని జాన్సన్ ల్యాబరేటరీలో పరిశోధనలు చేస్తున్నారు.

ఈ పరిశోధనలు ఫలించి హస్తి తప్పకుండ కోలుకుంటుందని పరిశోధకులు చెబుతున్నారు.మనం కూడా హస్తి త్వరగా కోలుకోవాలని ఆ తండ్రి కోరిక నెరవేరాలని ఆశిద్దాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube