స్వతహాగా కరెంటును ఉత్పత్తి చేసుకుంటున్న రైతు..!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీనీ కొందరు మంచికి ఉపయోగిస్తే.మరికొందరు దానిని చెడు వినియోగానికి ఉపయోగిస్తూ ఉంటారు.

 A Farmer Who Generates Electricity By Himself, Curent, Device, Karnataka, Farmer-TeluguStop.com

ప్రస్తుతం ఉన్న సమాజంలో కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ కరెంటు సమస్య ఉంది అంటే నమ్మండి.కరెంటు సమస్యతో అనేక ఇబ్బందిపడుతున్న రైతులు ఎంతో మంది ఉన్నారు.

అలాంటి ఒక రైతు తన ఇంటికి తానే ఎలాగోలా కరెంటును తీసుకురావాలని అనేక ప్రయత్నాలు చేశాడు.చివరికి అనుకున్నది సాధించి, అతి తక్కువ ఖర్చుతోనే ఎవరి సహాయం లేకుండా తన ఇంటికి కరెంట్ తెచ్చుకునే విధంగా డిజైన్ ను తయారు చేసుకున్నాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే… కర్ణాటక రాష్ట్రంలోని ఒక మారుమూల ప్రాంతానికి చెందిన రైతు సిద్దప్ప తన ఇంటికి విద్యుత్ కనెక్షన్ కావాలని హుబ్లీ విద్యుత్ సరఫరా కంపెనీ అడగగా.సిద్ధప్ప నివసించే ఇల్లు మారుమూల గ్రామం అవడంతో వారు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు వారు నిరాకరించారు.

దీనితో ఎట్టి పరిస్థితుల్లోనైనా తన ఇంటికి కరెంటు తీసుకొని రావాలని భావించిన సిద్ధప్ప పర్యావరణరహితంగా కరెంటును ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాడు.

Telugu Watts Curenet, Siddpa, Karnataka, Vvs Lakshaman-Latest News - Telugu

సిద్ధప్ప కరెంటు ఎలా తయారు చేశాడు అన్న విషయానికి వస్తే. నరాగుండ్‌ కొండలను గమనించిన సిద్దప్ప కరెంటు తయారీ కోసం విండ్‌మిల్లును తయారు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.ఇందుకోసం తన దగ్గర ఉన్న వనరుల సహాయంతో రూపొందించి తన ఇంటికి సమీపంలో ఒక కాలువ ప్రవహిస్తుండడంతో విద్యుత్ కోసం 5 వేల రూపాయలు ఖర్చుతో తన వద్ద ఉన్న ప్లాస్టిక్, ప్లాస్టిక్‌ ట్యూబులు, కలప, చక్రాలు లాంటి సామాగ్రితో కరెంటు ఉత్పత్తి అయ్యే విధంగా డిజైన్ చేశారు.

కాల్వ ప్రవహిస్తేనే విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.అలాగే ఈ డిజైన్ ద్వారా 150 వాట్స్ వరకు విద్యుత్తు ఉత్పత్తి అవుతుందని సిద్ధప్ప తెలిపారు.ఈ డిజైన్ ద్వారా ప్రస్తుతం 10 బల్బులు, 2 టీవీలకు అవసరమయ్యే కరెంటును ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఇలా పర్యావరణరహితంగా కరెంటును ఉత్పత్తి చేయడం విషయం తెలుసుకున్న మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా రైతు సిద్ధప్పను ప్రశంసించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube