దేవుడా: ఆ పావురం అన్ని కోట్లా..?!

మనలో చాలా మంది పావురాలు చూడటానికి,అలాగే పెంచుకోవడానికి కూడా ఎంతమంది ఇష్టపడుతుంటారు.కొన్ని ప్రాంతాలలో పావురాల రేస్ లను కూడా నిర్వహిస్తూ పెద్ద మొత్తంలో సంపాదించే వారు ఎందరో ఉన్నారు.

 Dove, Online Sale, Chaina, India, 14 Crores, Indian Dove Cost Is 14 Crores,-TeluguStop.com

ఇలా రేస్ ల కోసం పెద్ద ఎత్తున పావురాలకు బలిష్టమైన ఆహారాన్ని అందిస్తూ వారికి ఎన్నో సౌకర్యాలను కల్పిస్తూ ఉంటారు.ఇలాంటి పోటీల కోసం కొంతమంది పావురాలను అదేపనిగా పెంచే వారు కూడా ఉన్నారు.

ఇలా బాగా పెంచిన పావురాలను భారతదేశంలో కూడా వేలకు వేలు, లక్షలకు లక్షలు పోసి మరి కొనేవారు వుంటారు చాలామంది.

తాజాగా ఓ పావురాన్ని 14 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు ఓ ఆజ్ఞత వ్యక్తి.

ఒక పావురం 14 కోట్లా అని ఆశ్చర్యపోతున్నారా.? అవునండి బాబు.ఒక పావురం మన భారత కరెన్సీలో 14 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది.అంత ధర పలికిన పావురం పేరు న్యూ కిమ్.ఆన్ లైన్ లో పి‌జన్‌ ప్యార‌డైజ్‌ సంస్థ నిర్వహించిన వేలంలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా రికార్డు స్థాయిలో ఇంత భారీ సొమ్మను పెట్టి కొనుగోలు చేయడం ఇదే మొదటి సారి.చైనా దేశానికి చెందిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఏకంగా ఇంత భారీ మొత్తాన్ని పెట్టి పావురాన్ని కొనుగోలు చేశారు.

Telugu Chaina, Dove, India, Sale-Latest News - Telugu

ఇదే కంపెనీ గత సంవత్సరం ఓ మగ పావురాన్ని 1.25 మిలియన్ యూరోలకు కొనుగోలు చేయగా ఇప్పుడు ఆ రికార్డును ఈ పావురం బద్దలు కొట్టింది.ఇకపోతే ఈ పావురం న్యూ కిమ్ 2018 లో జరిగిన ‘ఏస్ పీజియన్ గ్రాండ్ నేషనల్ మిడిల్ డిస్టెన్స్ పోటీలో విజేతగా నిలవడంతో దాంతో ఆ పావురాన్ని కొనడానికి ఎంత మంది పోటీపడ్డారు.కేవలం రెండు సంవత్సరాలు వయస్సు ఉన్న ఈ పావురం కేవలం 200 యూరోల బేస్ ప్రైస్ తో వేలానికి ఉంచగా చివరకు 1.6 మిలియన్ యూరోలకు ఈ పావురం అమ్ముడుపోయింది.ఇంత వరకు ఇంత అత్యధిక ధర అమ్ముడుపోయినట్లుగా ఎక్కడా లేదని ప్యారడైస్ చైర్మన్ తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube