సముద్రంలో పడిన కుక్కని కాపాడిన డాల్ఫిన్.. ఈ వీడియో చూస్తే!

నీటిలో బతికే డాల్ఫిన్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి.ఇవి చాలా స్మార్ట్ కూడా.

 A Dolphin Who Saved A Dog That Fell Into The Sea If You Watch This Video , Dog,-TeluguStop.com

ఇక నేలపై బతికే కుక్కలు చాలా సన్నిహితంగా మెలుగుతాయి.ఇవి కూడా చాలా స్మార్ట్.

ఈ రెండు జంతువులు కలిసి ఫ్రెండ్షిప్ చేస్తే అద్భుతంగా ఉంటుంది కదా.ఒకదానికొకటి సహకరించుకుంటూ, కష్టంలో సహాయం చేసుకుంటూ ఉంటే ఆ దృశ్యాన్ని చూసినప్పుడు మనకి కూడా చాలా ఆనందం అవుతుంది.అయితే తాజాగా అందరినీ ఫిదా చేసే ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో కుక్క, డాల్ఫిన్ కలిసి ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాయి.కుక్క సముద్రం నీటిలో పడి పోయి మునిగిపోతుండగా డాల్ఫిన్ దానిని ఆ ప్రమాదం నుంచి కాపాడింది.అనంతరం ఇవి రెండూ కూడా సైగలతో మాట్లాడుకుంటూ తమ స్నేహాన్ని చాటాయి.

వీటి ఫ్రెండ్‌షిప్‌కి సంబంధించిన వీడియోను తాజాగా ఐఏఎస్ అధికారి అర్పిత్‌ శర్మ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.ఈ వీడియోకి ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్ వచ్చాయి.

జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని ఈ వీడియోకి ఐఏఎస్ ఆఫీసర్ ఒక క్యాప్షన్ జతచేశారు.ఈ బ్యూటిఫుల్ యానిమల్ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

వైరల్ అవుతున్న వీడియోలో నీటిలో పడిపోయిన కుక్కని డాల్ఫిన్ తన వీపుపై ఎక్కించుకోవడం చూడవచ్చు.అనంతరం ఆ డాల్ఫిన్ మెల్లగా ఈదుకుంటూ వచ్చి ఒక బోట్‌లోకి కుక్కను ఎక్కించింది.

దాంతో కుక్క బతికిపోయింది.అనంతరం ఇవి రెండూ ఒకదానికొకటి తమ భాషలో మాట్లాడుకుంటూ కనిపించాయి.

ఈ జంతువులు చాలా సంతోషంగా ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ ఎంజాయ్ చేశాయి.అనంతరం డాల్ఫిన్ నీటిలో విన్యాసాలు చేస్తూ కుక్క ని బాగా ఎంటర్‌టైన్ చేసింది.

కాగా ఈ రెండు జంతువుల స్నేహం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు

.

 
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube