అదేంటి? మరణించిన మనిషి కళ్లు, వెంట్రుకలతో( dead man’s eyes and hair ) బొమ్మ తయారు చేయడమా? ఇదెక్కడి తమాషా? అని సందేహం కలుగుతోంది కదూ.విషయం తెలియాలంటే మీరు ఈ పూర్తి కధనం చదవాల్సిందే.
నేడు ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే… ప్రాతీయతా భేదం అనేది లేకుండా నేరాలు ఘోరాలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి.రోజూ ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు హత్యకు గురి అవుతూ వుంటారు.
ఇక చంపిన దుండగులు అచ్చం సినిమాల్లో చూపిన మాదిరి హీరోల్లా ఫీల్ అయిపోయి అఘాత్యాలు చేస్తూ వుంటారు.
అలాంటి చర్యలను ప్రతిబింబించేలా ఓ వ్యక్తి బొమ్మలు తయారు చేసి టెర్రర్ పుట్టిస్తున్నాడు.ఇక్కడ ఫొటోలోని బొమ్మను చూస్తే మీకే అర్ధం అయిపోతుంది.మీరు దానిని చూసి ఎవరో ఎవరినో చంపి సంచిలో మూటకట్టి ఇలా పడేశారేమిటి అని అనుకుంటే పొరపాటు పడ్డట్టే.
చూడ్డానికి అచ్చం మనిషిలాగే కనిపిస్తున్న ఈ బొమ్మ పేరు జార్జ్( George ).చార్లెస్ రాస్( Charles Ross ) అనే పురావస్తు నిపుణుడు దీనిని తయారు చేశాడు.ఒక గుర్తు తెలియని వ్యక్తి 1930లో చనిపోతే అతని కళ్లు, వెంట్రుకలు తీసి, ఈ బొమ్మకు అమర్చడం విశేషం.
ఇకపోతే ఇతనికి దెయ్యాల భవంతి కంటే భయం పుట్టించే ఓ టెర్రర్ భవనాన్ని ఏర్పాటు చేయటం మహా ఇష్టం.ఇందుకోసం వివిధ రకాల భయంకరమైన బొమ్మలు, వస్తువులు తయారు చేస్తున్నాడు.అంతేకాకుండా వీటన్నింటినీ నాటింగ్‌హామ్‌లోని హాంటెడ్ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నాడు.
చార్లీ ఈ జార్జ్ బొమ్మ పెట్టగానే, రోజూ అక్కడికి వచ్చే సందర్శకులు సంఖ్య పెరిగి, చార్లీ ఫేమస్ అయ్యాడు.ఈ మధ్యనే బీబీసీ చానెల్‌లో ప్రసారమయ్యే ‘బార్‌గైన్ హంట్’కు ఆహ్వానం కూడా అందుకోవడం విశేషం.
అక్కడికి చార్లీ తను తయారు చేసిన కొన్ని బొమ్మలను తీసుకెళ్లడంతో భయంకరమైన ఈ జార్జ్ బొమ్మ ప్రస్తుతం వైరల్‌గా మారింది.