గ్రేట్ వారియర్.ఇంతకీ ఎవరూ.? ఎందుకు అనుకుంటున్నారా.? నార్మల్ గా కొన్ని చోట్ల మూగ జీవాలు చేసే పనులు ఔరా అనిపించేలా ఉంటాయి.మనం చేయలేని పనులను కూడా అవి చేసి చూపిస్తాయి.ఈ క్రమంలోనే రోడ్డు దాటే చిన్నారులకు ఓ కుక్క అండగా నిలిచింది.దీంతో గ్రేట్ వారియర్ అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.ఎక్కడైనా రోడ్డు దాటే సమయంలో మనుషులు క్రాసింగ్ గార్డ్ లాగా విధులు నిర్వహిస్తుంటారు.
కానీ, ఇక్కడ ఓ డాగ్ ఆ బాధ్యతలు తీసుకుంది.ఈ ఘటన రిపబ్లిక్ ఆఫ్ జార్జియాలో జరిగింది.
రోడ్డుపై వెహికిల్స్ బిజీ బిజీగా తిరుగుతున్నాయి.ఈ క్రమంలో కొందరు చిన్నారులు రోడ్డు దాటేందుకు సిద్ధంగా ఉన్నారు.
అక్కడకు వచ్చిన ఓ పెంపుడు కుక్క రోడ్డును బ్లాక్ చేసింది.వాహనాలను ఆపి ఆ పిల్లలు రోడ్డు క్రాస్ చేసేందుకు సాయం చేసింది.
చిన్నారులు రోడ్డు దాటుతున్న సమయంలో కార్లు ముదుకు కదులుతుంటే గర్జిస్తూ వాటిని ఆపింది.వారు సురక్షితంగా దాటేంత వరకు ఉండి .ఆ తరువాత కుక్క కూడా రోడ్డు మీద నుంచి బయటకు వెళ్లిపోయింది.దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
నెటిజన్లు గ్రేట్ వారియర్ అంటూ మెచ్చుకుంటున్నారు.