వైరల్‌ వీడియో : రెండేళ్లుగా రైల్వే పోలీస్‌ డ్యూటీ చేస్తున్న కుక్క, ఇంతకు ఏం చేస్తుందో చూడండి

మనం ఇప్పటి వరకు ఎన్నో కుక్కల గురించి వార్తల్లో చూశాం.కుక్కల ప్రవర్తన మనకు కొన్ని సార్లు అత్యంత విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది.

 A Dog Doing Rpf Duty In Chennai Railway Station-TeluguStop.com

కుక్కలు ఎక్కువగా విశ్వాసంను కలిగి ఉంటాయి.తన యజమానిని భద్రంగా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది.

తనకు కొంత తిండి పెట్టిన వారిని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తుంది.ఆ యజమానికి ఏమైనా అయినప్పుడు ఆ కుక్కలు పడే బాధల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

అలాంటి కుక్కల గురించి మనం ఇప్పటి వరకు విన్నాం, చూశాం.

Telugu Dog, Dogrpf, Chennai Dogs, Crpfjawans, Indianrailway-

ఇప్పుడు నేను చెప్పబోతున్న కుక్క చాలా ప్రత్యేకమైనది.ఈ కుక్క రెండు సంవత్సరాలుగా చేస్తున్న పనికి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్య పోతున్నారు.ఈ మద్య కాలంలో ఈ కుక్క గురించి స్థానికంగా ప్రముఖంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోషల్‌ మీడియా ద్వారా ఈ కుక్క గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలిసింది.

అతి పెద్ద సంస్థ అయిన ఇండియన్‌ రైల్వేస్‌ ఈ కుక్కకు సంబంధించిన వీడియోను పోస్ట్‌ చేయడంతో అంతా ఈ కుక్క గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.చెన్నైకు చెందిన ఈ కుక్కను గురించి జాతీయ మీడియా సంస్థలు కూడా కవర్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాయి.

దాంతో ఈ కుక్క వైరల్‌ అయ్యింది.

Telugu Dog, Dogrpf, Chennai Dogs, Crpfjawans, Indianrailway-

ఇంతకు ఈ కుక్క ఏం చేస్తుందో తెలుసా.గత రెండు సంవత్సరాలుగా చెన్నై రైల్వే స్టేషన్‌లో ఈ కుక్క ఉంటుంది.ఈ కుక్కకు స్టేషన్‌ వారు చిన్నపొన్ను అంటూ పేరు పెట్టారు.

ఈ కుక్క ఎప్పుడు రైల్వే స్టేషన్‌లోనే ఉంటుంది.స్టేషన్‌లో ఆర్ఫీఎఫ్‌ పనులు ఏమైతే ఉంటాయో అవి ఈ కుక్క చేస్తుంది.

అంటే పట్టాలపై దాటడం, ఫుడ్‌ బోర్డింగ్‌ చేయడం వంటివి పోలీసులు చూస్తు ఉండాలి.ఆ పనిని ఈ కుక్క చేస్తుంది.

ఎవరైనా పట్టాలు దాటేందుకు ప్రయత్నించినట్లయితే వెంటనే ఈ కుక్క గట్టిగా మొరగడంతో పాటు వారి వద్దకు వెళ్లి హెచ్చరిస్తుంది.

Telugu Dog, Dogrpf, Chennai Dogs, Crpfjawans, Indianrailway-

రైలు వచ్చినప్పుడు ఎవరైనా ఫుడ్‌ బోర్డ్‌పై ప్రయాణిస్తున్నా కూడా వారిని లోనికి వెళ్లేలా మొరిగి చెబుతుంది.ఇలా రోజులో 24 గంటలు ఈ కుక్క స్టేషన్‌లో ఉంటూ ఆన్‌ డ్యూటీలో ఉంటుంది.ఇప్పటి వరకు చిన్న పొన్ను ఎవరికి ఎలాంటి హాని చేయలేదని స్థానికులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube