చాలామంది తమ పెంపుడు జంతువులను తమ సొంత ఫ్యామిలీ మెంబర్స్(Family members) లాగా చూసుకుంటారు.ముఖ్యంగా విశ్వాసానికి మారుపేరైన కుక్కలను ఎంతో ప్రేమిస్తారు.
శుభకార్యాల్లో వీటికి స్పెషల్ రెస్పెక్ట్ ఇచ్చి తమ ప్రేమను చాటుకుంటారు.అయితే తాజాగా ఒక వరుడు తన పెళ్లి వేడుకలలో తన కుక్కతో కలిసి డాన్స్ చేశాడు.
పింక్ గౌన్ (Pink Gown)వేసుకున్న ఆ కుక్క కూడా వరుడితో కలిసి హ్యాపీగా నాట్యం చేసింది.ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వరుడు తన కుక్కతో కలిసి డ్యాన్స్ చేసుకున్న వీడియో వైరల్ గా మారింది.
ఈ వీడియోను 1812shivam అనే యూజర్ పోస్ట్ చేయగా, పారుల్ గులాటీ, సోనమ్ బజ్వా, ఈషా గుప్తా(Parul Gulati, Sonam Bajwa, Esha Gupta).వంటి సెలబ్రిటీలు కూడా దీనిని తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఈ వీడియోలో, వరుడు తన ప్రియమైన కుక్క లూసీని చేతుల్లోకి ఎత్తుకుని బారాత్‌లో కలిసి డ్యాన్స్ చేస్తున్న దృశ్యం కనిపించింది.గులాబీ రంగు(Pink color) దుస్తులు ధరించిన లూసీ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మెరిసింది.
ఈ వీడియో చూస్తుంటే సదరు వరుడికి ఈ కుక్క అంటే ఎంత ఇష్టం స్పష్టంగా తెలుస్తోంది.
ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) పోస్ట్ చేసిన కమల్ తల్యాన్ అనే వ్యక్తి, ఈ కుక్క తన అన్నయ్య కుటుంబానికి చెందినదని తెలిపారు.
‘edge.stream’ అనే వెబ్‌సైట్‌లో కూడా ఈ వీడియోను పోస్ట్ చేస్తూ, “ఇది నా అన్నయ్య పెళ్లి.ఈ కుక్క పేరు లూసీ” అని రాశారు.ఈ వీడియోను చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు ఎంతగానో ఆనందించారు.నటి ఈషా గుప్తా హార్ట్ ఎమోజీలతో స్పందిస్తే, ఇన్‌ఫ్లూయెన్సర్ పారుల్ గులాటీ “Awww + Awww” అని కామెంట్ చేశారు.చాలామంది నెటిజన్లు వరుడు తన పెళ్లిలో లూసీని చేర్చుకోవడం చాలా అందంగా ఉందని, ఇది నిస్వార్థ ప్రేమకు ఉదాహరణ అని ప్రశంసించారు.
ఈ వీడియోను ఇప్పటికే 24 లక్షల మందికి పైగా చూశారు.ఇంకా ఇది సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉంది.ఒక యూజర్, “నేను ఇప్పటివరకు చూసిన అత్యంత అందమైన దృశ్యం ఇదే!” అని కామెంట్ చేశారు.మరొకరు, “లూసీ వరుడితో కలిసి డ్యాన్స్ చేస్తున్న దృశ్యం అంటే నాకు చాలా ఇష్టం” అని అన్నారు.
చాలా మంది లూసీ ధరించిన గులాబీ రంగు దుస్తులను ప్రశంసించారు.ఒక యూజర్, “గులాబీ రంగు దానికి చాలా బాగా సరిపోయింది!” అని కామెంట్ చేశారు.మరికొందరు ఇలాంటి క్షణాలు ఇతర పెళ్లిళ్లలో కూడా ఉండాలని కోరుకుంటూ, ఇది పెంపుడు జంతువుల ప్రేమికులకు మంచి ఉదాహరణ అని అన్నారు.