వేరుశెనగ తీస్తుంటే వజ్రం దొరికింది.. చివరికి?

సాధారణంగా వర్షాలు అధికంగా కురుస్తుంటే ప్రజలు వజ్రాల వేట లో పడతారు.అధిక వర్షాలు పడటం వల్ల వజ్రాలు దొరుకుతాయని పలు రాష్ట్రాల నుంచి ప్రజలు అనంతపురంలోని వజ్రకరూరు ప్రాంతానికి, కర్నూలులోని తుగ్గలి మండలంలో ఎక్కువగా వజ్రాల అన్వేషణ చేస్తుంటారు.

 Diamond , Found, Peanuts , Being Taken , Rains, Kurnool, Seven Carrates Diamond-TeluguStop.com

ఈ నేపథ్యంలోనే తుగ్గలి మండలం లో వేరుశనగ పంటను తీస్తుండగా ఓ మహిళకు వజ్రం దొరకడంతో ఎంతో ఆనందించింది.

కర్నూలు జిల్లాలోని, తుగ్గలి మండలం లో వ్యవసాయ పనులు చేసుకుంటున్న ఓ మహిళకు వజ్రం దొరికింది.

ఆ వజ్రం విలువ దాదాపుగా కోటి రూపాయల విలువ చేస్తుందని అంచనా వేశారు.ఈ సంవత్సరం వర్షాలు అధికంగా పడటంతో తుగ్గలి మండలం లోని జొన్నగిరి, పగిడిరాయి గ్రామాలలో గ్రామస్తులు పెద్ద ఎత్తున వజ్రాల వేటలో పడ్డారు.

అంతేకాకుండా ఇక్కడికి వేరే రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వజ్రాల అన్వేషణ సాగిస్తున్నారు.

ఆ మహిళకు దొరికిన వజ్రాన్ని తీసుకొని గుత్తికి చెందిన ఒక వజ్రాల వ్యాపారి కి విక్రయించింది.

ఆ వజ్రం బరువు దాదాపు ఏడు క్యారెట్లు ఉందని వ్యాపారి ఆమెకి తెలిపాడు.అయితే వజ్రాల వ్యాపారి ఆ మహిళకు 11 లక్షల రూపాయల నగదు, రెండు తులాల బంగారాన్ని ఇచ్చినట్లు స్థానికులు తెలిపారు.

ఇదే మండలంలో గతంలో ఓ మహిళ కూలికి వ్యవసాయ పనులు చేసుకుంటుండగా వజ్రం దొరికిందని స్థానికులు ఈ సందర్భంగా గా తెలియజేశారు.అధిక వర్షాలు పడడంతో ఇతర పంటలన్నీ దెబ్బతిన్న కారణంగా , వేరుశనగ పంటను తీస్తున్నప్పుడు ఆ మహిళకు వజ్రం దొరికిందని గ్రామ ప్రజలు తెలియజేశారు.

కోటి రూపాయలు విలువ చేస్తుందని అంచనా వేసిన వజ్రానికి కేవలం 11 లక్షల రూపాయలు రావడంతో ఆ మహిళ కొంతమేర నిరాశకు గురైంది.అయితేఆ మండలంలో వజ్రం దొరికిందని ఆనోటా, ఈ నోట తెలియడంతో అక్కడికి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకొని వజ్రాల కోసం వెతుకుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube