ఇకనుంచి క్యాన్సర్ ఉందో లేదో 10 సెకన్లలో కనిపెట్టవచ్చు

మొదట, క్యాన్సర్ వచ్చిన ప్రతి శరీర భాగాన్ని కనిపెట్టడం కష్టం.క్యాన్సర్ ఉన్న ప్రతి టిష్యుని కనిపెట్టడం ఇప్పటి టెక్నాలజీ కి కూడా నూరుకి నూరుశాతం సాధ్యపడటం లేదు.

 A Device That Can Detect Cancer In 10 Seconds-TeluguStop.com

అందుకే క్యాన్సర్ పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం వెళ్లినా 100% రికవరితో తిరిగి రావడం లేదు.ఎందుకంటే డాక్టర్లు, టెక్నాలజీ ప్రతీ టిష్యూపై చికిత్స చేయడం లేదు.

మరి ఎలా? క్యాన్సర్ ఉన్న ప్రతి అణువుని తీసివేయడం ఎలా? ఇదే ఆలోచనతో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ వారు కొన్ని ప్రయోగాలు చేసి ఓ సరికొత్త డివైజ్ ని ఆవిష్కరించారు.దానిపేరే MasSpec pen .ఇది కేవలం 10 సెకన్లలో క్యాన్సర్ సోకిన టిష్యుని కనిపెట్టేస్తుందట.అదే నిజమైతే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీతో పోల్చుకుంటే ఇది 150% వేగవంతమైనది

ప్రస్తుతం Frozen Section Analysis అనే టెక్నాలజీని క్యాన్సర్ కణాలను కనిపెట్టడం కోసం వాడుతున్నారు.

ఇది ఒక్క sample మీద పనిచేయడానికి 30 నిమిషాల సమయం తీసుకుంటూ ఉంటుంది.అంత సమయం తీసుకున్నా, ఫలితాలు పూర్తిగా రావు.ఎన్నో క్యాన్సర్ కణాలు దీని నుంచి తప్పించుకుంటున్నాయి.దాంతో 20 శాతం క్యాన్సర్ కేసులు సరైన టెక్నాలజీ అందుబాటులో లేక పూర్తి చికిత్సకు నోచుకోవడం లేదు.

ఆ సమస్యకు పరిష్కారమే ఈ MasSpec Pen.

దీనిపై డాక్టర్ జేమ్స్ సులిబర్గ్ మాట్లాడుతూ “దేవుడా నాలో ఉన్న క్యాన్సర్ మొత్తం ఈ ఆపరేషన్ ద్వారా బయటికి వెళ్లిపోవాలని ప్రార్థించిన జనాలను వేల మందిని చూశాను నేను.కానీ శరీరంలోంచి క్యాన్సర్ పూర్తిగా బయట లాగటం అంత సులువైన విషయం కాదు.అదికూడా ముదిరిన క్యాన్సర్ అయితే ఇంకా కష్టం.లక్షల్లో డబ్బులు చెల్లించి, చికిత్సకోసం తమ ఆస్తులు అమ్మేసుకున్నారు.కానీ డాక్టర్ గా నా పేషంట్లకు పూర్తి న్యాయం చేయలేకపోతే నా వృత్తికి అర్థం లేకుండా పోతుంది.

అందుకే ఈ ప్రయోగం చేశాం.ప్రస్తుతం అందుబాటులో ఉన్న క్యాన్సర్ డయాగ్నస్టిక్ టెక్నిక్ కంటే మాస్కస్ పెన్ 152 రేట్లు మెరుగ్గా పని చేస్తుంది.

ఇది 96 శాతం వరకు క్యాన్సర్ సెల్స్ పసిగట్టేస్తుంది.కేవలం పది సెకండ్లలోనే ఒక టిష్యూకి కేన్సర్ ఉందో లేదో పసిగట్ట గలగడం దీని స్పెషాలిటీ.

దీనిద్వారా ఆరోగ్యకరమైన సెల్స్ నష్టపోవడం జరగదు ‌‌‌‌‌‌‌‌‌.అంత ఖచ్చితత్వం ఈ టెక్నాలజీ లో ఉంది ‌.అందులో ఎలాంటి సందేహం అక్కరలేదు.మేము మనుషుల మీద దీన్ని ప్రయోగించి చూశాం.

ఫలితాలు చాలా పాజిటివ్ గా ఉన్నాయి.ఈ టెక్నాలజీ క్యాన్సర్ పేషంట్లను ట్రీట్ చేసే ప్రతి హాస్పిటల్ కి అందాలనేది మా కాంక్ష.

అప్పుడే క్యాన్సర్ ద్వారా సంభవించే మరణాలను అదుపు చేయగలం” అంటూ తమ రిసెర్చి ఫలితాన్ని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube