ఒక్క రోజు తేడాతో ఇండియన్‌ బిగ్గెస్ట్‌ దర్శకులు..!     2018-11-14   10:43:42  IST  Ramesh P

ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ దర్శకులు అంటే ఒకప్పుడు బాలీవుడ్‌ దర్శకుల పేర్లు వినిపించేవి. కాని ఇప్పుడు మాత్రం ఇండియాస్‌ బిగ్గెస్ట్‌ చిత్రాల దర్శకుల పేర్లు అంటే ముందు వరుసలో రాజమౌళి మరియు శంకర్‌ల పేర్లు ఉంటాయి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. బాహుబలి చిత్రంతో రాజమౌళి బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్స్‌కు సైతం సాధ్యం కాని ఎన్నో రికార్డులను దక్కించుకున్నాడు. ఇక శంకర్‌ హాలీవుడ్‌ స్థాయిలో ఆలోచిస్తూ, తన సినిమాలను తెరకెక్కిస్తాడు. తాజాగా తెరకెక్కిన 2.ఓ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాహుబలి తర్వాత సంవత్సరంకు పైగా గ్యాప్‌ తీసుకున్న జక్కన్న తాజాగా మల్టీస్టారర్‌ మూవీని పట్టాలెక్కించాడు.

A Day After Rajamouli  Shankar Kicks It Off-Jr NTR Kamal Hassan Ram Charan RRR Movie

ఒక వైపు శంకర్‌ 2.ఓ చిత్రాన్ని విడుదలకు సిద్దం చేస్తూనే మరో వైపు కమల్‌ హాసన్‌తో ఇండియన్‌ 2 చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు. నవంబర్‌ 11 న జక్కన్న మల్టీస్టారర్‌ మూవీ ప్రారంభం అవ్వగా, ఒక్కరోజు తేడాతో అంటే నవంబర్‌ 12న శంకర్‌ ప్రతిష్టాత్మక ‘ఇండియన్‌ 2’ చిత్రం ప్రారంభం అయ్యింది. ఈ రెండు సినిమాలు కూడా పూజా కార్యక్రమాలు జరుపుకున్నాయి. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ కూడా ప్రారంభం కాబోతుంది. అద్బుతమైన స్పందన వస్తున్న ఈ చిత్రాలు రెండు కూడా 2020లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.

A Day After Rajamouli  Shankar Kicks It Off-Jr NTR Kamal Hassan Ram Charan RRR Movie

శంకర్‌ మరియు రాజమౌళిలు ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా పేరు దక్కించుకున్నారు. అలాంటి స్నేహితులు ఒక్క రోజు తేడాతో రెండు ప్రతిష్టాత్మక చిత్రాలను ప్రారంభించడంతో చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు, సినీ వర్గాల వారు ప్రేక్షకులు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కూడా చాలా రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలు. వీరిద్దరు ఈమద్య కాలంలో రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలు చేసి చాలా కాలం అయ్యింది. ఈ చిత్రాలు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ అప్పుడే ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.