సంచలన పధకం దిశగా దూసుకుపోతున్న దళిత బంధు

దళిత బంధు పధకం తెలంగాణలోనే కాక దేశం మొత్తంలో కూడా ఒకింత సంచలనం సృష్టించేలా కనిపిస్తున్నాయి.దళితులు గత కొన్నేళ్లుగా వివక్షకు గురవుతున్నారనే అపవాదు ఉన్న విషయం తెలిసిందే.

 A Dalit Relative Rushing Towards A Sensational Projec Trs Party, Dalitha Bandhu,-TeluguStop.com

అయితే దళితుల సంక్షేమమే లక్ష్యంగా కెసీఆర్ తీసుకవస్తున్న మరో పధకం దళిత బంధు.అయితే ఇప్పుడు హుజురాబాద్ లో ఈ పధకాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ పధకం అమలు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే ఈ దళిత బంధు అనేది ఒక కార్యక్రమం కాదని ఇదొక ఉద్యమం అని కెసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే.

అయితే ఈ పధకం ద్వారా ఒక్కో దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇచ్చి దళితులను ఆర్థికంగా పటిష్టం చేయాలన్నది కెసీఆర్ వ్యూహంలా కనిపిస్తోంది.నేడు దళిత బంధుపై కెసీఆర్ హుజూరాబాద్  నియోజకవర్గ దళితులతో ప్రగతి భవన్ లో సమావేశం  కానున్నారు.

అయితే ఈ పధకం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తే దళితులు ఆర్థిక పరిపుష్టత పొందుతారనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది.అయితే ఈ పధకం అమలు విధి, విధానాలు ఇంకా ప్రభుత్వం ప్రకటించకున్నా దళితుల ఆలోచనలు స్వీకరించి ప్రభుత్వం ఆలోచనలతో మిళితమై ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించనున్నారు.

మరి ఈ పధకం ఏమేరకు ప్రభావం చూపిస్తుందో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube