కూలీ చేసుకునే వ్యక్తి బ్యాంకు ఖాతాలో కోటి రూపాయలు.. ఎలా వచ్చాయంటే..

A Daily Labor Account Having One Crore Rupees

ఒక వ్యక్తి పొట్టకూటి కోసం రోజువారీ కూలి పనులు చేస్తుంటాడు.కూలీ పని చేసి ఇల్లు గడిపే వ్యక్తి నెలకు మహా అంటే ఒక 10 వేలు సంపాదిస్తాడు.

 A Daily Labor Account Having One Crore Rupees-TeluguStop.com

ఆ సంపాదన మొత్తం అతని కుటుంబం గడవడానికే సరిపోతుంది.ఇంకా పిల్లల చదువుకోసమని.

ఆసుపత్రి ఖర్చులని ఇలా చాలా వాటికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది.

 A Daily Labor Account Having One Crore Rupees-కూలీ చేసుకునే వ్యక్తి బ్యాంకు ఖాతాలో కోటి రూపాయలు.. ఎలా వచ్చాయంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కానీ కూలి పనులు చేసుకునేవ్యక్తి బ్యాంకు ఖాతాలో కోటి రూపాయలు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు అతన్ని పట్టుకుని ఆరా తీయగా పోలీసులకు అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.

వ్యక్తికి అతని బ్యాంకు ఖాతాలో కోటి రూపాయలు ఉన్నట్లు పోలీసులు చెప్పే వరకు తెలియదట.మరి అంత డబ్బు అతని ఖాతాలోకి ఎలా వచ్చాయని పోలీసులు విచారించగా అసలు నిజం తెలిసింది.

ఈ మధ్య ఘరానా మోసగాళ్లు ఎక్కువయ్యాయి.ఏదో విధంగా అమాయకులను వారికీ పావులుగా ఉపయోగించుకుని కోట్లు కొల్లగొడుతున్నారు.

దొంగ యాప్స్ కేటుగాళ్లు అతడిని అతని ఖాతాను ఒక పావుగా ఉపయోగించుకున్నారు.

Telugu Bank, Bank Loans, Delhi, Loans, Labor, Loan Apps, Crore, Fraud, Telangana-Latest News - Telugu

తెలంగాణ పోలీసులు ఆన్ లైన్ లో మోసం చేసే కేటుగాళ్లపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు.విచారణలో భాగంగా వీళ్ళు దోచుకుంటున్న డబ్బు అంత ఎక్కడికి పోతుందని పోలీసులు ఆరా తీస్తున్నారు.

డబ్బు అంతా ఎవరి ఖాతాలోకి పోతుందో ఆరా తీస్తే అసలు వీరిని నడిపించే వ్యక్తులను పెట్టుకోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.అందులో భాగంగానే కోటి రూపాయలకు పైగా ఉన్న బ్యాంకు ఖాతా ఢిల్లీ లో ఉందని తెలిసి పోలీసులు అక్కడకు వెళ్లి విచారించి అతని వివరాలు సేకరించారు.

పోలీసులు అతడిని వెతుక్కుంటూ వెళ్తే తీరా అక్కడ ఆ అడ్రస్ లో ఒక పూరి గుడిసెలో నివసిస్తున్న కూలీ చేసుకునే వ్యక్తి కనిపించడంతో అతన్ని విచారించారు.అయితే పోలీసులు అతన్ని ప్రశ్నించగా అతడు ఆ బ్యాంకు ఖాతా తనదేనని ఒప్పుకున్నాడు.

ఖాతాలో ఎంత డబ్బు ఉందో తెలుసా ? అని ప్రశ్నించగా నాకు అవేమీ తెలియదు.ఎవరో ఒక వ్యక్తి వచ్చి నే పేరు మీద బ్యాంకు ఖాతా తీసుకుంటామని చెప్పి అందుకు నీకు నెలకు 4 వేలు ఇస్తామని చెప్పారు.

అందుకు నేను సరే అన్నాను.

ఆ డబ్బు మా కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుందని సరే అన్నాను.

అందులో కోటి రూపాయలు ఉన్నాయని మీరు చెప్పే వరకు నాకు తెలియదు అని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు.అతడికి ఏటీఎం ను కూడా వాడడం తెలియదని పోలీసుల విచారణలో తేలింది.

ఆన్ లైన్ మోసగాళ్లు ఇలాంటి అమాయకులకు డబ్బులు ఎరగా వేసి వారిని తమ పావులుగా ఉపయోగించుకుంటున్నారని పోలీసులు తెలిపారు.

#Bank #Bank Loans #Crore #Loans #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube