అంబులెన్సు ఆలస్యం.. ఆ కరోనా బాధితుడు చివరికి!?

కరోనా కాలం.మానవత్వం మంటకలిసిపోయింది.

 Covid 19 Patient, Corona Patient Died, Ambulance Late-TeluguStop.com

పక్కన మనిషి అనారోగ్యంతో బాధపడుతున్నాడు అంటే పది అడుగులు దూరం వెళ్తున్నారు.అదే తుమ్ముతు.

దగ్గుతూ మరణిస్తే ఆగకుండా కిలోమీటర్లు పరిగెత్తుతున్నారు.ఇంకా ఇలాంటి ఘటనలు చూస్తున్న సమయంలోనే ఇప్పుడు నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం గాల్లోకి కలిసిపోయింది.

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు బాధితుడు.ఇంకా విషయం తెలిసిన వెంటనే అంబులెన్స్ పంపించాల్సిన అధికారులు దీన్ని ఏ మాత్రం పట్టించుకోలేదు.

దీంతో శ్వాస తీసుకోవడం క్షణక్షణం ఇబ్బంది పడుతూ ఆంబులెన్స్ కోసం ఎదురు చూశాడా బాధితుడు.

అయితే గంట.రెండు గంటలు కాదు ఏకంగా 4 గంటల పాటు నడిరోడ్డుపైనే మృత్యువుతో పోరాడి చివరకు చనిపోయాడు.ఆంబులెన్స్ లేట్ గా రావడంతోనే కరోనా బాధితుడు మరణించాడు.

ఇంకా ఈ విషయం తెలుసుకున్న మహానగర పాలికే కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఘటనపై విచారణకు ఆదేశించానని, దీనికి కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చారు.కాగా ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube