ఎనిమిదేండ్ల వ‌య‌సులో నాసా సంస్థ‌లో ప‌నిచేస్తున్న చిన్నారి..

ఈ మ‌ధ్య చిన్న పిల్ల‌లు కూడా త‌మ ట్యాలెంట్ ఏంటో నిరూపిస్తున్నారు.చిన్న వ‌య‌సులోనే అద్భుతాలు సృష్టిస్తున్నారు.

 A Child Working At Nasa At The Age Of Eight, Talented Child, Nasa, Brazil, Nicho-TeluguStop.com

ఆట‌లాడుకోవాల్సిన వ‌య‌సులో ఆవిష్క‌ర‌ణ‌లు చేసేస్తూ ఔరా అనిపిస్తున్నారు.ఇక ఇలాంటి వారిఇన సోష‌ల్ మీడియా విడిచి పెడుతుందా వెతికి మ‌రీ ప‌ట్టుకొచ్చి వారి గురించి ప్ర‌పంచానికి తెలియ‌జేస్తుంది.

ఇక ఇప్పుడు కూడా ట్యాలెంటెడ్ చిన్నారి గురించి తెలుసుకుందాం.బ్రెజిల్ దేశానికి చెందిన కోల్ ఒలివెరా చేస్తున్న ప‌ని ప్ర‌తి ఒక్క‌రినీ ఔరా అనిపించేలాఉంది.

ఆమె వ‌య‌సు కేవ‌లం ఎనిమిదేళ్లు మాత్ర‌మే.

కాగా ఇంత చిన్న వ‌య‌సులోనే ఆమె నాసాతో కలిసి పనిచేస్తోంది.

అత్యంత విజ్ఞానం క‌లిగిన సైంటిస్టులు ప‌నిచేసే నాసా సంస్థ‌లో ఆమె ప‌నిచేయ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.ఆమె నాసా సంస్థ‌లో అంతరిక్షంలో గ్రహశకలాల గుర్తించేందుకు ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ సెర్చ్ కొలాబరేషన్ ప్రాజెక్టులో ప‌నిచేస్తోంది.

ఆమె త‌న ట్యాలెంట్‌ను నిరూపించుకుంటూ 18 ఖగోళ వస్తువులను గుర్తించి అబ్బుర ప‌రుస్తోంది.బ్రెజిల్ దేశంలోని ఫోర్టాలెజా ఏరియాలో నివ‌సిస్తున్న నికోల్ ఒలివెరా చిన్నత‌నం నుంచే అంత‌రిక్ష సైంటిస్టు కావాల‌ని అనుకుందంట‌.

Telugu Astoroid Hunter, Brazil, Nasa, International, Nichole Olivera, Child-Late

అయితే ఇలాంటి చిన్నత‌నం నుంచే అంత‌రిక్షంలోని గ్ర‌హ‌శ‌క‌లాలు, అలాగే నక్షత్రాల గురించి తెలుసుకునేందుకు వీలుగా కొన్నేళ్ల కిందట నాసా సంస్థ ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టును స్థాపించింది.ఇందులో చిన్న పిల్ల‌ల ద‌గ్గ‌రి నుంచి కాలేజీ విద్యార్థుల దాకా అంత‌రిక్షంపై ప్రత్యేక ఆసక్తితో పాటుగా నైపుణ్యాలు ఉన్న స్టూడెంట్ల‌కు ఇందులో అవ‌కాశం క‌ల్పించి వారు కూడా త‌మ‌తో పాటు ప‌నిచేసే విధంగా ప్రోత్స‌హిస్తున్నారు.ఇందులో భాగంగానే నికోల్ ఒలివెరా ఆస్టరాయిడ్ హంటర్ గా నాసా సంస్థ‌లో ప‌నిచేస్తోంద‌ని తెలు్తోంది.ఎంతైనా చిన్న వ‌య‌సులోనే ఇలా చేయ‌డం గ్రేట్ క‌దా.ఇప్పుడు అంద‌రూ ఆమెను శ‌భాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube