వైరల్ : ఒంటికాలుతో తన కలలను నిజం చేసుకుంటున్న చిన్నారి.. ఎందరికో స్ఫూర్తిదాయకం!

అవయవాలు అన్ని సరిగ్గా వున్నా సరే కొంతమంది అవకాశాలు సరిగ్గా వినియోగించుకోరు సరికదా ఎదుటివారిని నిందిస్తూ వుంటారు.అయితే ఇక్కడ ఈ చిన్నారికి ఓ కాలు లేదు.ఒంటికాలుతోనే నడుస్తుంది.అయితేనేం… పట్టుదల ఉంటే ఎలాగన్నా అనుకున్నది సాధించి తీరొచ్చు అని ఆమెను చూసిన ఎవ్వరికైనా అర్ధం అవుతుంది.అవును… తన అంగవైకల్యాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా, కష్టపడి అనుకున్న గమ్యానికి చేరుకొనే దిశగా ఆ చిన్నారి వేస్తున్న అడుగులను చూస్తే, ఎలాంటివారికైనా మనసు ఉప్పొంగిపోతుంది.

 A Child Who Makes His Dreams Come True With One Leg Inspiring For Many One Leg, Viral Latest, News Viral, Sonu Sood, Social Media, Viral , Bihar , Seema-TeluguStop.com

వివరాళ్లోకెలితే.

బిహార్‏, జాముయి జిల్లాకు చెందిన సీమా అనే బాలిక 2 సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో ఒక కాలు కోల్పోయింది.దీంతో ఒంటికాలుకే పరిమితమైపోయింది.

 A Child Who Makes His Dreams Come True With One Leg Inspiring For Many One Leg, Viral Latest, News Viral, Sonu Sood, Social Media, Viral , Bihar , Seema-వైరల్ : ఒంటికాలుతో తన కలలను నిజం చేసుకుంటున్న చిన్నారి.. ఎందరికో స్ఫూర్తిదాయకం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

చదువుకోవాలనే ఆరాటం ముందు విధి చేసిన గాయం ఏమాత్రం అడ్డుగా మారలేదు ఆ పాపకు.పంటిబిగువున బాధను బిగబట్టి.

ఒంటికాలుతో కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్ కు వెళ్తోంది.ఒంటికాలుతో పాఠశాలకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ్ వైరల్ అయ్యింది.

దీంతో రియల్ హీరో సోనూసూద్ ఆమె పట్టుదలకు కరిగిపోయి ఈ చిన్నారికి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

సోను సూద్ స్పందిస్తూ… “ఆ చిన్నారి ఇప్పుడు 2 పాదాలపై పాఠశాలకు వెళ్తుంది.ఏమిటని ఆశ్చర్యపోతున్నారా? ఆమెకి ఇపుడు టికెట్ పంపుతున్నాను.ఆ చిన్నారి 2 కాళ్లపై నడించే సమయం ఆసన్నమైంది” అంటూ తన ఎన్జీవ్ సూధా ఫౌండేషన్ ను ట్యాగ్ చేశారు.అంతేకాకుండా.ఈ చిన్నారి వీడియోపై ఢిల్లీ CM అరవింద్ కేజ్రీవాల్ సైతం స్పందించారు.చదువుకోసం అంగవైకల్యాన్ని లెక్కచేయాని ఆ చిన్నారిని ఆకాశానికెత్తేశారు.తనవంతు సాయం చేయడానికి సిద్ధంగా వున్నానని అన్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube