ఐస్ లాండ్ లో బొమ్మ‌ను పోగొట్టుకున్న చిన్నారి.. తిరిగి ఇచ్చిన నెటిజ‌న్లు

A Child Who Lost A Toy In Iceland Netizens Who Gave It Back

ఇవాళ రేపు సోష‌ల్ మీడియా ఎంత‌లా వ్యాపించి పోయిందో అంద‌రం చూస్తూనే ఉన్నాం.ఎక్క‌డ ఏది జరిగినా స‌రే చిటికెలోనే వైర‌ల్ అయిపోతూ ఉంటాయి.

 A Child Who Lost A Toy In Iceland Netizens Who Gave It Back-TeluguStop.com

నెట్టింట్ వైర‌ల్ వీడియోలు, ఫొటోలు షేర్ అవ్వ‌డ‌మే కాకుండా అప్పుడ‌ప్పుడు ఎంతో మందికి సాయం కూడా జ‌రుగుతుంది.ఎవ‌రికైనా ఆప‌ద వ‌స్తే సోష‌ల్ మీడియా వేదిక‌గా విజ్ఞ‌ప్తి చేస్తే ల‌క్ష‌లాది మంది స్పందించి కాపాడుతున్న వైనాన్ని కూడా చూస్తున్నాం.

అంతెందుకు మ‌న దేశంలో కూడా చిన్నారుల‌కు ఏదైనా ఆప‌రేష‌న్ లాంటివి చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు సోష‌ల్ మీడియా అంతా ఒక్క‌టై విరాళాలు సేక‌రించిన రోజులు కూడా ఉన్నాయి.

 A Child Who Lost A Toy In Iceland Netizens Who Gave It Back-ఐస్ లాండ్ లో బొమ్మ‌ను పోగొట్టుకున్న చిన్నారి.. తిరిగి ఇచ్చిన నెటిజ‌న్లు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక కొన్ని సార్లు అయితే ఉద్య‌మాలు కూడా సోష‌ల్ మీడియాలోనే జ‌రుగుతుంటాయి.

నిజం చెప్పాలంటే ఏ విష‌యానికి అయినా స‌రే సోష‌ల్ మీడియా అనేది ఒక ప్లాట్ ఫామ్ లాగా అయిపోయింది.ఇక్క‌డ కోరితే జ‌ర‌గ‌నిది అంటూ ఏదీ ఉండ‌దేమో.

అందుకే ఓ బాలిక కూడా త‌న చిన్న కోరిక‌ను సోష‌ల్ మీడియాలో కోరితే నెటిజ‌న్లు అంతా ఏక‌మై ఆమె కోరిక‌ను తీర్చారు.లండ‌న్ కు చెందిన 10 ఏళ్ల హాటీ సెయిన్స్ రీసెంట్ గా ఐస్‌ల్యాండ్ కు వెళ్లింది.

అక్క‌డ ప‌ర్య‌టిస్తున్న క్ర‌మంలో ఆమె త‌న ఆవు బొమ్మను పోగొట్టుకుంది.దీంతో ఆమె చాలా బాధ ప‌డిపోయిది.

Telugu 10 Years Girl, Amazing Netizens, Cow Toy, Face Book, Island, Landan, Sains, Viral News-Latest News - Telugu

ఇక బొమ్మ కోసం ఆమె త‌ల్లిదండ్రులు క్రిస్సీ , రిచర్డ్ సెయిన్స్ ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫ‌లితం లేకుండా పోయింది.ఇక చివ‌రి ప్ర‌య‌త్నంగా చిన్నారి తండ్రి త‌న కూతురు ప‌డుతున్న బాధ‌ను తెలుపుతూ ఫేస్ బుక్‌లో పోస్టు పెట్టారు.అయితే దీని మీద చాలామంది నెటిజ‌న్లు స్పందించారు.ఇలా ఒక‌రి నుంచి మ‌రొక‌రికి ఆ బొమ్మ వార్త చేర‌డంతో కేవ‌లం మూడు రోజుల్లోనే ఆ బొమ్మ అనేక‌మంది చేతులు మారింది.

చివ‌ర‌కు నెటిజ‌న్లు ఒక‌రి నుంచి మ‌రొక‌రు ఆ బొమ్మ‌ను చేర‌వేరుస్తూ చిర‌వ‌కు చిన్నారి చెంత‌కు చేరుకుంది.దాంతో అంద‌రూ ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

.

#Landan #Sains #Netizens #Island #Cow Toy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube