ఏడేళ్లకే తన తల్లికి అమ్మ అయిన చిన్నారి..!

చక్కగా స్కూల్ కి వెళుతూ తోటి పిల్లలతో ఆడుకోవలిసిన వయసులో ఇంటి బాధ్యతలు చేపట్టింది ఒక ఏడేళ్ల చిన్నారి.ఒకపక్క అమ్మ, తమ్ముడి ఆలనా పాలన చూస్తూ మరొక పక్క చదువుకుంటూ వయసుకు మించిన భారాన్ని మోస్తుంది ఈ చిన్నారి.ఏడేళ్ల వయసు అంటే తోటి పిల్లలతో ఆడే పాడే వయసు అలాంటిది ఈ చిన్నారి ఆ వయసులోనే అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి తల్లిగా మారి తన యోగ క్షేమాలు చూస్తుంది.మరోవైపు… తన తమ్ముడి బాగోగులను చూసుకుంటుంది.మరి ఆ చిన్నారికి సంబంధించిన వివరాలు ఏంటో ఒకసారి చూద్దామా.

 A Child Who Has Been A Mother To His Mother For Seven Years, 7years, Kid, Mothe-TeluguStop.com

ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన కేలాదేవీ అనే మహిళ గత కొన్నిరోజులుగా వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతోంది.

ఈ క్రమంలోనే ఆమె తరుచూ అనారోగ్యానికి గురవుతుండడంతో ఆమె భర్త, కుటుంబం ఆమెను, ఆమె పిల్లల్ని దిక్కుతోచని స్థితిలో వదిలేసి వెళ్లిపోయారు.పిల్లల్ని పోషించే క్రమంలో కేలాదేవి తలో నాలుగు ఇళ్లల్లో పని చేస్తూ తన ఇద్దరు పిల్లలను పోషించుకునేది.

ఆ తరువాత కొన్నాళ్లపాటు పొగాకు ఉత్పత్తులను అమ్ముతూ జీవితాన్ని సాగించింది.కానీ విధి వైపరిత్యం వలన ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించసాగింది.దీంతో ఆగ్రాలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం చేరగా అక్కడ వైద్యులు ఆమెను పరీక్ష చేసి ఆమె వెన్నెముకకు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు.అయితే శాస్త్రచికిత్సకు అయ్యే ఖర్చును భరించే స్థోమత ఆమెకు లేకపోవడంతో కొన్నాళ్ల నుంచి ఆస్పత్రిలోనే ఉంటోంది.

కేలాదేవికి తోడుగా తన ఏడేళ్ల కుమార్తె ప్రీతా ప్రజాపతి ఉంటూ అన్నీ తానై అమ్మకు సేవలు చేస్తోంది.కేలాదేవికి అన్నం తినిపించడం మెదలుకొని, అన్ని అవసరాలను తానే దగ్గర ఉండి మరి తీరుస్తుంది.

అమ్మ బాధ్యత మాత్రమే కాకుండా ఒకటో తరగితి చదివే తన తమ్ముడు సత్యం కుమార్ బాధ్యత కూడా తానే తీసుకుని వాడి బాగోగులూ కూడా తనే చూసుకుంటోంది.

ఓ వైపు తల్లిని, తమ్ముడిని చూసుకుంటూ, మరోపక్క ఇంటిపనులు చేస్తూ పాఠశాలకు వెళ్తోంది ఈ చిన్నారి.

ఖాళీ దొరికిన సమయాల్లో ఆసుపత్రిలోనూ అమ్మ పక్కన కూర్చుని హోంవర్క్ చేస్తోంది.ఈ చిన్నారిని చూసిన అందరి మనసులు బాధతో బరువెక్కుతున్నాయి.

ప్రీతా ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది.పెద్దయ్యాక ఏమి చేస్తావ్ అని అడిగితే అందుకు సమాధానంగా ప్రీతా ఇలా చెప్పుకొచ్చింది.“నేను పాఠశాలకు వెళ్లి వస్తాను.అలాగే ఇంటి పనులు చేస్తూ నా తమ్ముడికి అన్నం తినిపిస్తాను.

ఖాళీ ఉన్నప్పుడు హోమ్ వర్క్ చేస్తాను.నేను పెద్దయ్యాక బాగా చదివి డాక్టర్ అవుతాను.

ఎందుకంటే.మా అమ్మ అనారోగ్యం పోగొట్టి ఆమెకు మంచి వైద్యం అందిస్తాను అని ప్రీతా అంటుంది.

అలాగే కేలాదేవీ మాత్రం ఎవరయినా తమకు సహాయం చేసి ఆదుకునే వారికోసం చూస్తుంది.తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా గాని తన పిల్లలను మాత్రం బాగా చదివించడమే తనకు ఉన్న  ఒకే ఒక కల అని బాధతో రోదిస్తుంది.

అమ్మకే అమ్మ అయిన చిన్నారి ప్రీతాను చూస్తే మనసు చలించిపోతుంది కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube