రోగం మరిచి ఆసుపత్రి బెడ్ మీద స్టెప్పులేసిన చిన్నోడు..

చిన్న పిల్లలకు జ్వరం వస్తే తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడుతారో వారికి మాత్రమే తెలుసు.పిల్లలు ఏడ్చినా వారిని సముదాయించడానికి, ఏడుపు మానిపించడానికి పేరెంట్స్ పడే కష్టం అంతా ఇంతాకాదు.

 A Child Who Forgot His Disease And Stepped On A Hospital Bed, Viral Video, Crazy-TeluguStop.com

కొందరు పిల్లలు కొద్దిపాటి జ్వరానికే నాన్‌స్టాప్‌గా ఏడుస్తుంటారు.వారికి ఏం కావాలో నోరు తెరచి చెప్పలేరు.

ఇక ఆస్పత్రికి తీసుకెళ్లినపుడు ఇంజెక్షన్ వేస్తారేమో అన్న భయంతో వాళ్లు పెట్టే ఆర్తనాదాలు ఆస్పత్రి మొత్తం మార్మోగుతూ ఉంటాయి.కానీ, ఓ బుడ్డోడు మాత్రం ఓ వ్యాధితో బాధపడుతూ ఆస్పత్రిలో చేరాడు.

ఆ విషయం మరి తనకు నచ్చిన సాంగ్ వినపడగానే ఆస్పత్రి బెడ్డు మీద నిలబడి ఫుల్ జోష్‌తో డ్యాన్స్ చేశాడు.ప్రస్తుతం ఈ వీడియా సామాజిక మాద్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.

బ్రెజిల్‌లోని ఓ ఆస్పత్రిలో మిగ్యుల్ అనే బాలుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు.వైద్యులు అతనికి చికిత్స అందిస్తూ పరిశీలనలో ఉంచారు.అయితే, తన అభిమాన పాట రావడంతో బాలుడు ఒక్కసారిగా లేచి నిలబడి ఉత్సాహంగా స్టెప్పులు వేశాడు.టెలివిజన్‌లో ఓ సింగర్ మైక్ చేత పట్టుకుని పాడిన సాంగ్‌ను విని ఈ చిన్నోడు కూడా తన చేతిలోని చెంచాను మైక్ లాగా వాడుతూ పాట పడుతూ డ్యాన్స్ చేశాడు.

ఈ దృశ్యం ఆస్పత్రిలోని సిబ్బందిని, వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.మిగ్యుల్ గ్యాస్ట్రోఎంటెరిటిస్‌తో బాధపడుతూ చికిత్స కోసం ఆస్పత్రిలో చేరినా అతనిలో కొంచెం కూడా భయం కనిపించలేదని వైద్యులు చెప్పారు.

కష్ట సమయంలో జీవితాన్ని ఎలా ఆస్వాదించాలో ఈ బాబు నేర్పించాడని చాలా మంది ఈ వీడియా చూసిన వారు మాట్లాడుకుంటున్నారు.మంచి మ్యూజిక్ వింటే మనసు కుదుట పడుతుందని నిరూపించాడని చెప్పుకుంటున్నారు.మిగ్యుల్ గత వారం గ్యాస్ట్రోఎంటెరిటిస్‌తో ఆసుపత్రిలో చేరగా, అతనికి ఇష్టమైన పాట రావడంతో వెంటనే డ్యాన్స్ చేయడం ప్రారంభించాడని, అప్పుడు మిగ్యుల్‌ను ఆపడం ఎవరి వల్ల కాలేదని సిబ్బంది వెల్లడించారు.ఈ బుడ్డోడి డ్యాన్స్ వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరు వేల మంది వీక్షించారు.

వీడియో అనతికాలంలోనే వైరల్ కావడంతో మిగ్యుల్ అందరి హృదయాలను గెలుచుకున్నాడు.బాలుడు ఉత్సాహంతో చేస్తున్న డ్యాన్సును చూసి నెటిజన్లు తమ కామెంట్లతో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube