కంటే కూతుర్నే కనాలి అని కవులు ఊరికే చెప్పలేదు.మనచుట్టూ వున్నవాళ్లు, మనతో సహా అందరూ మగ బిడ్డలు కావాలనే కోరుకుంటారు.
ఆడ పిల్లలు పుట్టినా కాస్త చిన్న చూపు వహిస్తారు.అయితే కొన్ని కొన్ని సందర్భాలలో ఆడపిల్లలే తల్లిదండ్రుల మీద ఎనలేని ప్రేమను కురిపిస్తారనేది వాస్తవం.
అలాంటి సంఘటనలు కూడా అనేకం జరుగుతూ ఉంటాయి.తాజాగా అలాంటి ఆడపిల్ల ప్రేమకు సంబంధించినటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సదరు వీడియోని చూసిన నెటిజన్లు మాకు కూడా అలాంటి కూతురు ఉంటే ఎంత బావున్ను అని కూతురులేనివారు కామెంట్ చేయడం విశేషం.
ఇక్కడ వీడియోలో చూస్తే రెస్టారెంట్ లో పనిచేసి అలసిపోయి తలకిందకు వాల్చి కూర్చొని పడుకున్న తండ్రికి స్వెర్టర్ కప్పిన చిన్నారిని గమనించవచ్చు.
కొన్ని క్షణాల తరువాత అతగాడికి మెలకువ వచ్చి వీపుపై వున్న స్వెట్టర్ ని గమనించి చాలా ఎమోషనల్ అవుతారు.కాగా ఈ వీడియో నెటిజన్లు హృదయాలను కదిలించింది.
పీపుల్ మ్యాగజైన్ ప్రకారం.వాంగ్ ఓ రెస్టారెంట్ యజమాని.
కరోనా మహమ్మారి సమయంలో ఆర్థికంగా అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొన్నాడు.అయినా రెస్టారెంట్ ను ఎంతో శ్రమకోర్చి నిర్వహిస్తున్నాడు.
ఈ క్రమంలోనే వాంగ్ తన రెస్టారెంట్ పని పూర్తి చేసుకున్న తరువాత కొంచెం విరామం తీసుకున్నాడు.అయితే వాంగ్ నిద్రపోతున్న సమయంలో అతని చిన్న కుమార్తె కిచెన్ గదిలోకి ప్రవేశించి తండ్రి నిద్రపోతుండటాన్ని గమనించి తండ్రి భుజంపై స్వెర్టర్ కప్పింది.దాంతో తన కూతురు తనకు మరింత ఉపశమనం కలిగించేందుకు స్వెర్టర్ వేసిందని గుర్తించాడు.కాగా ఈ క్రమంలో తన కూతురు చూపిన ప్రేమకు కన్నీరు పెట్టుకున్నారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.