ఓటర్ స్లిప్ లేదా ..? అయితే ఇలా ఓటు వేయొచ్చు !  

A Chance To Vote If There Is No Voter Slip-

రేపు తెలంగాణలో పోలింగ్ జరగబోతోంది. ఈ సందర్భంలో… కొంతమందికి ఓటర్ స్లిప్ అంది ఉండకపోవచ్చు. దీంతో కొంతమంది ఓటు ఎలా వేయాలి అనే టెన్షన్ పడుతున్నటారు. అందుకే దీనికి ప్రత్యామ్న్యాయంగా… 12 రకాల గుర్తింపు కార్డులు చూపేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది. వీటిలో ఏదైనా ఒకటి చూపించి ఓటు హక్కును వినియోగంచుకోవచ్చు..

ఓటర్ స్లిప్ లేదా ..? అయితే ఇలా ఓటు వేయొచ్చు ! -A Chance To Vote If There Is No Voter Slip

జాబితాలో ఓటరు పేరుకు సంబంధించి తప్పొప్పులు ఉన్నట్లయితే గుర్తింపు పత్రంలో నిర్ధారించుకుని ఓటు వేసేందుకు కూడా అవకాశం ఉంది.

1 . పాస్‌పోర్ట్2. డ్రైవింగ్ లైసెన్స్3 . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు 4 .బ్యాంకులు, పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌పుస్తకాలు5 పాన్‌కార్డు6 . ఆధార్‌కార్డు7 . ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌కార్డ్8 . కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డ్9 . ఫొటోతో ఉన్న పెన్షన్‌ ధ్రువీకరణ పత్రం10 . ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్‌ స్లిప్11 . ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎంఎల్‌సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు12 . ఎన్‌పీఆర్‌కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డ్‌ లు