కుక్క‌ను ఓ ఆటాడుకున్న పిల్లి.. చూస్తే క‌డుపుబ్బా నవ్వాల్సిందే..

కుక్క‌, పిల్లి ఈ రెండు జంతువులు ఎప్పుడూ వైరాన్ని ప్ర‌ద‌ర్శించేవే.వాటికి ఒక‌టంటే ఒక దానికి అస్స‌లు ప‌డ‌దు.

 A Cat Playing With A Dog Id You See This Laughing Enough, Cat Video, Dog-TeluguStop.com

అందుకే ఎప్పుడు ఎదురు ప‌డినా స‌రే కుక్క పిల్లిని చంపేసేందుకు ప్ర‌య‌త్నిస్తుంది.కానీ పిల్లి మాత్రం కుక్క‌ను త‌ప్పించుకుని పారిపోతూనే ఉంటుంది.

కానీ పొర‌పాటున కుక్క‌కు దొర‌కిందో ఇంక అంతే సంగ‌తి.అయితే ఈ రెండింటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతూనే ఉంటాయి.

అయితే ఇప్పుడు కూడా ఓ ఫ‌న్నీ వీడియో నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.దాన్ని చూస్తే విప‌రీతంగా న‌వ్వుకుంటారు.

సాధార‌ణంగా పిల్లి, కుక్క వీడియోలు అంటే వేట‌కు సంబంధించిన‌వి అనే అనుకుంటారు.ఎందుకంటే పిల్లిని క‌నిపిస్తేనే చీల్చి చెండాడుతుంది కుక్క‌.అలాంటిది ఇప్పుడు మాత్రం ఓ పిల్లి ఏకంగా కుక్క‌ను ముప్పు తిప్ప‌లు పెట్టింది.ఇందుకు సంబంధించిన ఫ‌న్నీ వీడియోను చూసిన వారంతా కూడా క‌డుపుబ్బా న‌వ్వుకుంటున్నారు.

ఇప్పుడు మ‌నం చూసే వీడియోలో ఓ ఇంట్లో కుక్క హాయిగా సోఫాలో ప‌డుకుంటుంది.అయితే ఇంత‌లోనే పిల్లి అక్కడకు వచ్చి దాన్ని ఆటాడుకుంటుంది.

ఎలాగైనా దాన్ని ఆట‌ప‌ట్టించేందుకు రెడీ అయిపోతుంది.

ఇక అనుకున్న‌దే త‌డ‌వుగా కుక్క‌ను డిస్టర్బ్ చేయ‌డం స్టార్ట్ చేసింది.

ఆ కుక్క‌ను త‌న కాలితో రక్క‌డం.దాంతో ఆ కుక్క లేచేస‌రికి సోఫా కింద దాక్కోవ‌డం ఇలా చేస్తోంది ఆ పిల్లి.

ఇలా పదేపదే ఆ కుక్క‌ను ఇబ్బంది పెడుతూ ముప్పుతిప్ప‌లు పెడుతోంది.లేచిన ప్ర‌తిసారి అక్క‌డ ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డంతో ఆ కుక్క ఎవ‌రు డిస్ట‌ర్బ్ చేస్తున్నారో అర్థం కాక త‌ల ప‌ట్టుకుంటుంది.

కాగా దీన్నంతా కూడా అక్క‌డున్న వారు వీడియో తీసి ట్వీట్ చేయగా విప‌రీతంగా వైర‌ల్ అవుతోంఇ.జంతు ప్రియులను ఈ వీడియో విప‌రీతంగా ఆకట్టుకుంటోంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube