కావాలనే చంద్రబాబుపై కేసు నమోదు..: యనమల

టీడీపీ అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు అన్నారు.కావాలనే కుట్ర పూరితంగా చంద్రబాబుపై కేసు పెట్టారని పేర్కొన్నారు.

 A Case Has Been Registered Against Chandrababu..: Yanamala-TeluguStop.com

తప్పుడు కేసులు బనాయించి చంద్రబాబును వేధిస్తున్నారని యనమల ఆరోపించారు.జైలులో ఉన్న కూడా చంద్రబాబు ప్రజల కోసమే ఆలోచిస్తున్నారన్న యనమల పార్టీ కార్యకర్తల గురించి చంద్రబాబు అడిగారని తెలిపారు.

అక్రమ కేసుల్లో ఇరుకున్న పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలని చెప్పారని వెల్లడించారు.చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు.

కాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో కుటుంబ సభ్యులు భువనేశ్వరి, నారా బ్రాహ్మణిలతో పాటు సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు కూడా ములాఖత్ అయిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube