వ‌ర‌ద‌ల్లో మునిగిపోయిన కారు.. డ్రైవ‌ర్ ఏం చేశాడో తెలిస్తే..

ఇప్పుడు వ‌ర్ష‌కాలం వాన‌లు ఏ స్థాయిలో దంచి కొడుతున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు.ఇక‌పోతే నార్త్ రాష్ట్రాల్లో అయితే ఈ వ‌ర‌ద‌ల బీభ‌త్సం చాలా ఎక్కువ‌గా ఉంది.

 A Car That Sank In A Flood   If You Know What The Driver Did    Car, Flood , Utt-TeluguStop.com

మ‌రీ ముఖ్యంగా ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో అయితే భారీ వర్షాలు అత‌లాకుత‌లం చేసేస్తున్నాయి.ఈ రాష్ట్రాల్లో ఇప్ప‌టికే అనేక ప్రాంతాలు జలమయం కావ‌డాన్ని మ‌నం చూడొచ్చు.

ఇక మామూలుగానే వ‌ర‌ద‌లు అంటే ప‌ట్ట‌ణాల్లోని లోగ‌ట్టు ప్రాంతాల‌ను ముంచెత్త‌డాన్ని మ‌నం ఎప్ప‌టి నుంచో చూస్తూనే ఉన్నాం.ఇక ఇప్పుడు కూడా ఇలాగే ఓ లోగ‌ట్టు ప్రాంతాన్ని వ‌ర‌ద‌లు ముంచేశాయి.

ఇక ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో అయితే ఈ లోతట్టు ప్రాంతాల ప్రజల క‌ష్టాలు మామూలుగా లేవు.ఎప్పుడు ఎక్క‌డి నుంచి ఏ వ‌ర‌ద నీరు వ‌చ్చి త‌మ‌ను ముంచెత్తుతుంతో అర్థం కాక నానా తంటాలు ప‌డుతున్నారు.

ఇక ఈ రాష్ట్రంలోని బాగ్ పట్ జిల్లాలో అయితే ఈ వ‌ర‌ద్ల అక్క‌డి ప్ర‌జ‌ల పరిస్థితి చాలా దారుణంగా త‌యారైంది.ఇక ప‌ట్ట‌నంలోని రైల్వే అండర్ పాస్ ప్రాంతం మొత్తం కూడా వ‌ర‌ద తాకిడికి పూర్తిగా నీరుతో నిండిపోయింది.

అయితే ఈ వ‌ర‌ద నీటిలో వస్తున్న ఓ వ్య‌క్తి త‌న ఫార్చ్యూనర్ కారును ఏ మాత్రం భ‌య‌ప‌డ‌కుండా అలాగే నీటిలో పోనిచ్చాడు.

Telugu Delhi, Drinage Problem, Flood, Season, Utta Pradesh-Latest News - Telugu

ఇంకేముంది ఆ కారు కాస్తా ఆ వ‌ర‌ద నీటిలో చిక్కుకుపోయి ఎటూ కదలకుండా అలాగే ఉండిపోయింది.ఇక వ‌ర‌ద నీటిలో కారు మునిగితే నీరు చేర‌కుండా ఉంటాయా చెప్పండి.కారులో మొత్తం నీరు చేరడంతో ఆ డ్రైవ‌ర్ కాస్తా త‌న కారు టాప్ పైకి ఎక్కాడు.

కాగా ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విప‌రీతంగా హ‌ల్ చ‌ల్ చేస్తోంది.అయితే ఈ ఏరియాలో స‌రైన డ్రైనేజీ వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలా నీరు నిలిచిపోతోంద‌ని తెలుస్తోంది.

ఇదంతా రమాలా పోలీసు స్టేషన్ పరిధిలో ఉండే జీవన గ్రామంలో ఇలా వ‌ర‌ద‌లు ముంచెత్తుతున్నాయి.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube