హ్యాండిల్ పట్టుకోకుండా 130కి.మీ సైకిల్ తొక్కిన కెనడియన్.. రికార్డులు బ్రేక్!

సాధారణంగా సైకిల్ హ్యాండిల్ పట్టుకోకుండా 10 కిలోమీటర్ల దూరం తగ్గాలంటేనే చాలా కష్టం.అలాంటిది కెనడియన్ సైక్లిస్ట్ రాబర్ట్ ముర్రే( Robert Murray ) ఇటీవల హ్యాండిల్‌బార్‌ను అస్సలు టచ్ చేయకుండా ఏకంగా 130.29 కిలోమీటర్ల సైకిల్ రైడ్‌ను విజయవంతంగా పూర్తి చేశాడు.అలా హ్యాండిల్ పట్టుకోకుండా సైకిల్‌పై ఎక్కువ దూరం ప్రయాణించినందుకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.

 A Canadian Who Ride A Bicycle For 130 Km Without Holding The Handle Broke The Re-TeluguStop.com

ముర్రే అమోఘమైన బ్యాలెన్స్, ఓర్పు, అచంచలమైన దృష్టితో అద్భుతమైన ఈ ఫీట్‌ను సాధించాడు.ఆ ఫీట్‌తో రికార్డు పుస్తకాలలో తన పేరును పొందుపరిచాడు.

Telugu Guinness, Latest, Robert Murray-Latest News - Telugu

ఈ అద్భుతమైన ప్రయాణం 5 గంటల 37 నిమిషాలు సాగింది, ముర్రే ఫుల్ డెడికేషన్‌తో దీనిని సాధించగలిగాడు.అంతేకాదు, ఈ ఫీట్‌తో తన స్టామినా చాటుకున్నాడు.ఇది ఇతరులకు ప్రేరణగా కూడా నిలిచింది, లిమిట్స్ అధిగమించినప్పుడే విజయాలను సాధించగలమని ఈ సైక్లిస్ట్ కథ చెప్పకనే చెబుతోంది.ముర్రే ఈ రికార్డ్ తనకోసం మాత్రమే బద్దలు కొట్టలేదు.

ఈ ప్రయత్నం వెనుక అతను ఇతరులకు సహాయం చేయాలనే ఒక మంచి కారణం ఉంది.అల్జీమర్స్ సొసైటీ ఆఫ్ కాల్గరీ కోసం నిధులను సేకరించడానికి ముర్రే సైక్లింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్నాడు, సైక్లింగ్ అంటే రాబర్ట్‌కు ఎంతో ఇష్టం.

అందుకే దీనిని ఎంచుకున్నాడు.తన కుటుంబంలో చాలామంది అల్జీమర్స్ వ్యాధి బారిన పడ్డారని ఆయన అన్నాడు.

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌తో మాట్లాడుతూ, “అల్జీమర్స్ వల్ల నా బామ్మను కోల్పోయా.రికార్డును బద్దలు కొట్టడం, అలాంటి కారణం కోసం డబ్బును సేకరించడం ఒకేసారి సాధించాను!” అని అన్నాడు.

Telugu Guinness, Latest, Robert Murray-Latest News - Telugu

సైక్లింగ్ పట్ల చిన్నతనంలోనే ప్రేమ పెంచుకున్న ముర్రే కాలక్రమేణా దానిని ఎక్కువ దూరం తొక్క గల శక్తిని సంపాదించాడు.15 ఏళ్ల వయస్సులో కొనుగోలు చేసిన తన మొదటి రోడ్ సైకిల్‌ను ఇప్పటికీ తనతో పాటే ఉంచుకున్నాడు.అదే సైకిల్‌పై అతను ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.ఆ సైకిల్‌లోని చాలా పార్ట్స్ కాలక్రమేణా భర్తీ చేసినా, గీతలు, సొట్టలను కలిగి ఉన్న ఫ్రేమ్‌ను మాత్రం మార్చలేదు.

ఈ గుర్తులు అతని అంకితభావానికి, దానిపై గెలిచిన లెక్కలేనన్ని మైళ్లకు నిదర్శనంగా పనిచేస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube