నోరూరించే ద్రాక్ష,ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు  

A Bunch Of 24 Grapes Sold For $11,000 In Japan.-

ద్రాక్ష పండు అనగానే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నోరుతెరచుకొని మరి ఉంటారు తినడానికి.దీనితో రేటు ఎంత ఉన్నా ఏంతో కొంత తీసుకొని మరి ద్రాక్ష పండు ను రుచిచూస్తూ ఉంటారు.అయితే మరీ దారుణంగా ఒక్క ద్రాక్ష గుత్తి ధర 7.5 లక్షల రూపాయలు అంటే నమ్మగలరా.అంటి ద్రాక్ష గుత్తి ధర లక్షల్లోనా ఏంటా ప్రత్యేకత అని అనుకుంటున్నారా...

A Bunch Of 24 Grapes Sold For ,000 In Japan.--A Bunch Of 24 Grapes Sold For 000 In Japan.-

నిజంగా ఇది నిజం ఒక ఎర్రని ద్రాక్ష గుత్తి రుబీ రోమన్ గ్రేప్స్ అని పిలుస్తారు.ఈ ద్రాక్ష పండ్లను చాలా అరుదుగా పండిస్తారు.ఎంతో అందంగా, ఎర్రగా కనిపించే ఈ ద్రాక్ష పండ్లను 2008 నుంచి పండించడం మొదలుపెట్టారు.అయితే జపాన్‌లోని ఇషికావా దీవిలో పరిమిత సంఖ్యలో వీటిని పండిస్తారు.

సీజన్లో మొదటి విక్రయానికి ముందు ఒక ద్రాక్ష గుత్తిని వేలానికి పెడతారు.దీన్ని కొనుగోలు చేసేందుకు వందలాది మంది ఔత్సాహికులు పోటీపడతారు.ఈ ఏడాది మొదటి ద్రాక్ష గుత్తిని రీసెంట్‌గా కనజవాలో వేలానికి పెట్టగా, జపాన్‌కు చెందిన ప్రముఖ గాయకుడు తకాషీ హొసాకవా ఈ ద్రాక్ష గుత్తిని వేలంలో గెలుచుకున్నాడు.

A Bunch Of 24 Grapes Sold For $11,000 In Japan.--A Bunch Of 24 Grapes Sold For $11 000 In Japan.-

దీనికి రూ.11 వేల డాలర్లను చెల్లించనున్నాడు అంటే అక్షరాల మన కరెన్సీ లో 7.5 లక్షలు అన్నమాట.మొత్తం ఈ గుత్తిలో 24 ద్రాక్ష పండ్లు ఉన్నాయి.మరీ 24 ద్రాక్ష పండ్లకు అంత మొత్తం అంటే ఇక ద్రాక్ష తిన్నట్లే.నిజంగా అంత ఖరీదు పెట్టి ద్రాక్ష కొని తినాలి అంటే కూడా పెట్టిపుట్టాలి అని చెప్పాలి.సాధారణ రోజుల్లో ఈ జాతి ద్రాక్ష గుత్తి ధర 460 డాలర్లు (రూ.31,537) మాత్రమే ఉంటుందట.కానీ వేలం లో మాత్రం ఇంత భారీ ధర పలకడం విశేషం.