అక్క కోసం వెతుకున్న అతనికి పెద్ద షాక్..! హంతకుడిని పట్టించిన ఫేస్ బుక్.! అసలేమైందంటే?

చిన్నప్పుడు తన వేలుపట్టి నడిపించిన అక్క.అమ్మలా లాలించిన అక్క.

 A Brothers Long Search For His Missing Sister-TeluguStop.com

అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయింది.ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది.

అప్పుడు ఊహతెలియని ఆ తమ్ముడు.కాస్త పెద్దయ్యాక అక్క కోసం వెదకడం ప్రారంభించాడు.

చివరకు అక్క ఆచూకీ అయితే తెలిసింది కాని నమ్మలేని నిజం వెలుగు చూడాల్సి వచ్చింది.ఆమె ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనుకున్నాడు.

కానీ.కట్టుకున్నోడే చంపేశాడని తెలిసి.

హంతకుడి కోసం వేట కొనసాగించాడు.చివరకు నిందితుడిని పోలీసులకు పట్టించాడు.

వివరాలలోకి వెళ్తే.

నార్కట్ పల్లి మండలం మాండ్రా గ్రామానికి చెందిన ప్రియాంక ను.నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం వెంకేపల్లి గ్రామానికి చెందిన మోర హన్మంతు 2004లో పెళ్లిచేసుకున్నాడు.మూడేళ్లపాటు ప్రేమించుకున్న వీరిద్దరూ.

బయటికి వెళ్లి వివాహం చేసుకున్నారు.వీరిద్దరికి 2005లో బాబు, 2006లో పాప పుట్టారు.

రెండోసారి గర్భవతి అయినప్పుడు అక్క ప్రియాంకను హైదరాబాద్ లో తమ్ముడు ఉపేందర్ కలుసుకున్నాడు.ఆ తర్వాత ప్రియాంక ఆచూకీ దొరకలేదు.2009లో ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా.ఫలితం కనిపించలేదు.

అప్పటి నుండి ఆమె తమ్ముడు ఉపేందర్ వెతకడం ప్రారంభించాడు.

అసలు కథ ఏంటంటే.

హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న హనుమంతుతో అప్పట్లో ప్రియాంకకు పరిచయం అయ్యింది.ఇంట్లో చెప్పకుండా అతడిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది.

రెండేళ్లు ఎల్బీనగర్‌లో ఉన్నారు.తర్వాత మర్రిగూడెంకు వచ్చేశారు.

అప్పుడే ఇద్దరి మధ్య విభేదాలొచ్చాయి.భార్యపై అనుమానంతో ఆమెను దారుణంగా హింసించేవాడు.

తనకు పుట్టలేదన్న అనుమానంతో 11 రోజుల పసిపాపను చంపేశాడు.ప్రశ్నించిన భార్యకు కూడా హత్య చేసి బావిలో పడేశాడు హనుమంతు.

మగపిల్లాడిని తన దగ్గరే పెట్టుకుని కుటుంబంతో సంబంధాలు లేకపోవడంతో ప్రియాంక కనిపించకుండా చనిపోయినా ఎవరూ పట్టించుకోలేదు.ఇప్పుడు ఉపేంద్ర రావడంతో నిజాలన్నీ బయటకొచ్చాయి.

అసలు ఉపేంద్ర ఎలా కనిపెట్టాడు అంటే.? ఇటీవల ఫేస్ బుక్ చూస్తుంటే.హన్మంతు ముదిరాజ్ అనే పేరుతో ఓ ఐడీ కనిపించడంతో.తన అక్కను పెళ్లిచేసుకుంది అతడే అని గుర్తించాడు ఉపేందర్.హన్మంతు హైదరాబాద్ లో ఓ క్యాబ్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.క్యాబ్ కంపెనీని సంప్రదించి.

హన్మంతు ఉంటున్న వివరాలు తెల్సుకున్నాడు.అతడి సొంత గ్రామానికి వెళ్లి ఎంక్వైరీ చేస్తే.

అక్కను మూడేళ్ల కిందటే హత్య చేశాడని.బాబును కొండ మల్లేపల్లి తెలిసినవారికి, పాపను హైద్రాబాద్ లో ఇచ్చేశాడని తెల్సుకున్నాడు.

ఉపేంద్ర ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హనుమంతును అరెస్ట్‌ చేసి విచారించారు.అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా వెంకటపల్లి గ్రామ శివారులోని రామిరెడ్డి బావిలో యువతి దుస్తులను గుర్తించారు.

ప్రియాంక ఎముకలను బావి నుండి బయటికి తీశారు.నిర్ధారణ కోసం వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం పంపారు.

పదేళ్ల క్రితమే హత్య జరిగివుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.తమకు ఎలాగైనా న్యాయం చేయాలని ఉపేందర్, అతడి సోదరుడు, తల్లి పోలీసులను కోరుతున్నారు.

ప్రియాంక కనిపించకుండా పోయిందనే బాధలోనే తండ్రిని కోల్పోయామన్నాడు ఉపేందర్.భార్యకు మరొకరితో అక్రమసంబంధం ఉందన్న అనుమానంతోనే హత్య చేసినట్టు నిందితుడు చెప్పాడని, దర్యాప్తు కొనసాగిస్తున్నామని జిల్లా ఎస్పీ రంగనాథ్ వెల్లడించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube