అక్క ప్రాణాలకు తన ప్రాణాలు ఫణంగా పెట్టాడు..! కానీ చివరికి ఏమైందో తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!  

A Brother Sad Story-

ఈ మధ్యనే అమ్మ చనిపోయింది…ఆ బాధ నుండి కోలుకోకముందే అక్కకి కాలేయ వ్యాధి. చివరికి కాలేయం ఇచ్చినా ప్రాణం దక్కలేదు. ఆ యువకుడికి వచ్చిన కష్టం వింటే ఎవరికైనా కన్నీళ్లొస్తాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేటకు చెందిన కన్నూరి బాబు, శైలజ దంపతులకు నలుగురు సంతానం..

అక్క ప్రాణాలకు తన ప్రాణాలు ఫణంగా పెట్టాడు..! కానీ చివరికి ఏమైందో తెలుస్తే కన్నీళ్లొస్తాయి.!-A Brother Sad Story

కన్నూరి బాబు వీఆర్ఓగా పనిచేస్తున్నారు. నాలుగేళ్ళ క్రితం మొదటి కూతురికి పెండ్లి చేశారు. కొంత కాలం క్రితం అనారోగ్యంతో కన్నూరి బాబు భార్య చనిపోగా… రెండవ కూతురు శిరీష అనారోగ్యంతో మంచాన పడింది.

హాస్పిటల్ లో చేర్పిస్తే… కాలేయమార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పారు.

అక్క ప్రాణాలు నిలబెట్టేందుకు తమ్ముడు రవితేజ తన ప్రాణాలను ఫణంగా పెట్టాడు. తన కాలేయాన్ని ఆమెకు ఇస్తానని డాక్టర్లకు చెప్పారు. పరీక్షలు చేసిన డాక్టర్లు.

తమ్ముడి కాలేయంలో కొంతభాగం అతడి అక్కకి అమర్చారు. అలా… తమ్ముడు రవితేజ..

అక్కకు కాలేయ దానం చేశాడు. అంత బాగానే జరిగింది.

అక్క రాకతో మళ్ళీ ఇల్లు సంతోషంగా ఉంటుంది అని సంబరపడ్డాడు రవితేజ. ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలువలేదు.

అక్క శిరీష్ బతకలేదు.

ఆపరేషన్ చేసిన 20 రోజులకే చనిపోయింది. ప్రాణంగా భావించిన అక్క చనిపోవడంతో. తమ్ముడి వేదన ఆపడం ఎవరి తరం కాలేదు..

“నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేసినా ప్రాణాలు నిలువలేదా… అక్కా” అని రవితేజ ఏడుస్తుండటంతో చూసినవాళ్లందరి గుండె బరువెక్కింది.